Morning Top News: బీఆర్ఎస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ’ధరణి’పై విచారణకు ప్రభుత్వం ఆదేశం, వైసీపీ సర్కార్ నిర్వాకంతో ఆందోళనలో కాలనీ వాసులు వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నల్గొండ జిల్లా, సత్య సాయి జిల్లాలో దైవదర్శానికి వచ్చిన ఏడుగురి బతుకులు తెల్లారిపోయాయి. రెండు వేర్వేరు ప్రమాదాలల్లో పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేకువజామున పొగ మంచు ఎక్కువగా ఉండడంతో దారి సరిగా కనిపించకపోవడంతోనే ప్రమాదాలు జరిగాయని సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
KTRపై ఈడీ కేసు నమోదు
ఫార్ములా ఈ - కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, HMDAచీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కేటీఆర్‌కు భారీ ఊరట
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తైనందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకరరావు, గండ్ర మోహన్‌రావు వాదించారు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
’ధరణి’పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ధరణి’పై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసన సభలో ప్రకటించారు. భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ధరణిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 1.50 వేల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారాయని ఆరోపించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బీఆర్‌ఎస్‌పై రేవంత్ తీవ్ర ఆగ్రహం
బీఅర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన 'ధరణి' పోర్టల్ అన్నదాతలకు భూములను దూరం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్.. విపక్ష పార్టీ అహంకారంతో వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా మర్యాదలను ఉల్లంఘించి గందరగోళం సృష్టిస్తున్నారని.. సభాపతిపైనే దాడి చేసే ధోరణిలో చర్చను అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని.. ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తెలంగాణ శాసనసభను షేక్ చేసిన ఈ ఫార్ములా కేసు
తెలంగాణ అసెంబ్లీని ఫార్ములా-ఈ కేసు షేక్ చేసింది. దీనిపై చర్చకు పట్టుబట్టిన బీఆర్‌ఎస్ సభలోనే నిరసన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. సభ ప్రారంభం నుంచే బీఆర్‌ఎస్ సభ్యులు ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చకు పట్టుబట్టారు. సభకు వస్తూనే కేసుపై నిరసన చేస్తూ వచ్చారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమమని నినాదాలు చేశారు. అందుకు నిరసనగాా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీకీ భారీ వర్ష హెచ్చరిక
రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి 60 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే, రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరిశీలించిన అనంతరం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఒక రోజు మందుగానే రైతులకు ధాన్యం డబ్బులు ఇస్తే మరింత సంతోషిస్తారని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వైసీపీ సర్కార్ నిర్వాకం.. ఆందోళనలో కాలనీ వాసులు
ప్రభుత్వంపై ఉన్న నమ్మకం వారిని నట్టేట ముంచింది. రిజిస్ట్రేషన్ కూడా ప్రభుత్వం చేయించి ఇస్తే వారు ఇక ఆస్తి విషయంలో ఢోకా లేకుండా నిశ్చితంగా ఉంటారు. కానీ గుంటూరులోని నల్లకుంటగా పిలిచే లక్ష్మిరఘురామయ్య నగర్ కాలనీ వాసులు మాత్రం మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో పదిహేనేళ్ల కిందటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన స్థలాలను హఠాత్తుగా 22Aలో పెట్టేశారు. దీంతో అవసరాలకు అమ్ముకోవడానికి కాదు కదా తాకట్టు పెట్టుకోవడానికి కూడా చాన్స్ లేకుండా పోయింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అరెస్ట్
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని పోలీసులు అరెస్టు చేశారు.1998లో కోయంబత్తూరులో 58 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉగ్రవాది బాద్ షా అంతిమయాత్రకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోయంబత్తూరులోని గాంధీపురం బస్టాండ్ సమీపంలో వెయ్యి మందికి పైగా ర్యాలీ నిర్వహించడంతో అన్నామలైను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..