అన్వేషించండి

High Court shock KTR : కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఉరట - పది రోజుల వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశాలు

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది. వారం వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Telangana  High Court not to arrest KTR for 10 days : ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో డబ్బుల గోల్ మాల్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన  పిటిషన్  పై హైకోర్టులో విచారణ జరిగింది.  పది  రోజుల వరకూ కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది.  క్వాష్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు లాయర్ సుందరం వాదించారు. 

అవినీతి లేదన్న కేటీఆర్ తరపు లాయర్

ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు... ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం జరిగిందని కేటీఆర్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 నాడు ఫిర్యాదు వస్తే 19 నాడు FIR చేశారు... ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండా FIR చేశారన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తు లేదని వాదించారు. 2023 అక్టోబర్ లో చేసుకున్న అగ్రిమెంట్ పరకారమే FEO కి చెల్లించారని..   అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని కేటీఆర్ తరపు లాయర్ ప్రశ్నించారు. పబ్లిక్ సర్వెంట్ నేర పూరిత దుష్ప్రవర్తన చేస్తే పీసీ యాక్ట్ పెట్టాలి.. కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో క్రిమినల్ మిస్ కాండక్ట్ నేర (పూరిత దుష్ప్రవర్తన) ఎక్కడ జరగలేదు..13(1)a, 409 అనే సెక్షన్ లు వర్తించవన్నారు. 2024 లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయి..కాంగ్రెస్ ప్రభుత్వం FEO కు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందన్నారు.  ప్రాధమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దమనిఅఫెన్స్ జరిగిందని తెలిసాక మూడునెలల లోపే కేసు రిజిస్టర్ చేయాలన్నారు. 11నెలల తర్వాత కేసు నమోదు చేశారు ..లలిత కుమార్ వర్సెస్ యూపీ  కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఈ కేసులో వర్తిస్తుందని తెలిపారు.  ఈ కార్ రిసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని.. సీజన్ 9 లో 110 కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలిపారు. సీసన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుంది...దీంతో ప్రభుత్వం ప్రమోటర్ గా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా  కొత్త ఒప్పందం జరిగిందని.. ఎన్నికల కోడ్ ఉల్లగించారనడానికి ఎలాంటి అధారాలు లేవన్నారు. ప్రొసీజర్ పాటించలేదు అనడం  సరైంది కాదన్నారు. ఈ విషయంలో కేటీఆర్ లబ్ది పొందేలదన్నారు. 

ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందన్న అడ్వకేట్ జనరల్

ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందని అడ్వకేట్ జనరల్ తెలిపారు.  రెండు నెలల క్రితం MAUD చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారని.. విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని అడిగిన న్యాయమూర్తి.. ఏజీ ఆ పత్రాలు అందించారు.  Fir ద్వారానే దర్యాప్తు జరుగుతుందని...ప్రతి విషయం fir లో ఉండదు.దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గత మవుతాయన్నారు. దర్యాప్తులో ఈ కేసులో భాగస్వామ్య లైన వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని.. విదేశీ కంపెనీకి ప్రజధనం బదిలీ అయ్యింది ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
Ind vs Eng 3rd Odi Live Score: టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
టీమిండియా భారీ స్కోరు.. గిల్ సెంచ‌రీ.. కోహ్లీ, శ్రేయ‌స్ ఫిఫ్టీలు, ర‌షీద్ కు 4 వికెట్లు
Telangana Ration Card: తెలంగాణలో రేషన్‌కార్డు దరఖాస్తులపై కీలక అప్‌డేట్- కంగారు పడొద్దని అధికారుల సూచన 
తెలంగాణలో రేషన్‌కార్డు దరఖాస్తులపై కీలక అప్‌డేట్- కంగారు పడొద్దని అధికారుల సూచన 
Viral: తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
తాగినంత లిక్కర్ ఫ్రీ - హ్యాంగోవర్ వస్తే లీవ్ కూడా - ఈ జపాన్ కంపెనీని దేవుడే పెట్టించి ఉంటాడు!
Embed widget