Annamalai arrest: ఉగ్రవాద సానుభూతిపరుని అంతిమయాత్రకు అనుమతిపై నిరసన - కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అరెస్ట్
Tamil Nadu BJP president K Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని పోలీసులు అరెస్టు చేశారు.కోయంబత్తూరులో పార్టీ తరపున నిర్వహించిన నిరసనను అడ్డుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Police detain Tamil Nadu BJP president K Annamalai in Coimbatore: తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోయంబత్తూరులో జరిగిన బ్లాక్ డే ర్యాలీలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను పోలీసులు అరెస్టు చేశారు. 1998లో కోయంబత్తూరులో 58 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉగ్రవాది బాద్ షా అంతిమయాత్రకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోయంబత్తూరులోని గాంధీపురం బస్టాండ్ సమీపంలో వెయ్యి మందికి పైగా ర్యాలీ నిర్వహించడంతో అన్నామలైను పోలీసులు అరెస్టు చేశారు.
కోయంబత్తూరు పేలుళ్ల సూత్రధారి బాద్ షా చనిపోవడంతో అధికార అంతిమయాత్రకు ప్రభుత్వం అనుమతి
కోయంబత్తూరు పేలుళ్ల సూత్రధారి బాద్ షా అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. 17న ఆయన అంతిమయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడాన్ని తమిళనాడు బీజేపీ, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కోయంబత్తూరులో పోలీసులు ట్రాఫిక్ ను నిలిపివేసి అంతిమయాత్రకు అనుమతి ఇచ్చారు. వివాదాస్పద ఊరేగింపుకు నిరసనగా డిసెంబర్ 20వ తేదీని 'బ్లాక్ డే'గా ప్రకటించింది. ఈ ఊరేగింపునకు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అన్నామలై సహా పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అన్నామలై డీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నిరసనకు నేతృత్వం వహించారు.
VIDEO | Police detain Tamil Nadu BJP president K Annamalai in Coimbatore.
— Press Trust of India (@PTI_News) December 20, 2024
Annamalai was leading a party protest against the DMK-led state government, alleging "glorification of a terrorist who was the reason for the loss of 58 lives in the peace-loving city of Coimbatore in… pic.twitter.com/soturcFgdd
డీఎంకే ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన బీజేపీ
కోయంబత్తూరులో శాంతియుతంగా నిరసన తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై ఇతర కార్యకర్తలు, సోదర ఉద్యమ సభ్యులను అరెస్టు చేయడం తమిళనాడు ప్రభుత్వ అరాచక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. నేరస్తులతో చేతులు కలపడండం, నిజాయితీపరులను అరెస్టు చేయడం తమిళనాడు ప్రభుత్వ అన్యాయమైన, అన్యాయమైన పద్దతని మండిపడ్డారు. హింసాత్మకులకు మద్దతు ఇస్తూ మంచి వారి అనుమతి నిరాకరిస్తున్న తమిళనాడు ప్రభుత్వ సవతి తల్లి వైఖరిని తమిళనాడు ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని స్పష్టం చేశారు.
అన్నామలై అరెస్టును ఖండించిన తమిళనాడు బీజేపీ సీనియర్ నేతలు
అన్నామలై అరెస్టు ఘటనపై బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. నేరస్థులు ఊరేగింపులు చేయడానికి అనుమతి ఇస్తారని అదే తాము ర్యాలీలు చేస్తే అరెస్టు చేస్తారని మండిపడ్డారు. తమిళనాడు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.