అన్వేషించండి

Top 10 Headlines Today: ఏపీ విద్యార్థులకు హ్యాపీ న్యూస్- తెలుగు రాష్ట్రాల్లో చల్లబడని వాతావరణం

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today:  

మరో రెండు రోజులు వేడిగాలులే

చినుకు జాడ లేదు... ఎండలతో ఠారెత్తిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఈ రెండు రోజులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఏపీ తెలంగాణలోనే కాదు పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, బిహార్‌, ఒడిశా, తమిళనాడులో ఇది పరిస్థితి కనిపిస్తోంది. వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఒంటిపూట బడులు

ఏపీలో ఒంటిపూట బడులను జూన్ 24 వరకు పొడిగించింది ప్రభుత్వం. రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అధికారిపై దాడి

మహబూబాబాద్ జిల్లాలో ఓ ఎమ్మార్వోపై గిరిజనలు దాడి చేశారు. ఓ వైపు వాళ్లు దాడి చేస్తుండగానే ఎమ్మార్వో పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఎమ్మార్వోను కాపాడారు. పోలీసులు వస్తున్నట్లు గమనించిన గిరిజనులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే గాయాలపాలైన తహసీల్దార్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పవన్‌పై ప్రసన్న విమర్శలు

వారాహి యాత్రతో వైసీపీ నేతలు మళ్లీ పవన్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఇటీవల పవన్ పై వ్యక్తిగత విమర్శలు పెద్దగా వినిపించలేదు, ఏదో చెప్పుల గోల జరుగుతోంది. అయితే నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం పవన్ కల్యాణ్ వివాహాలను మళ్లీ ప్రస్తావించారు. అయితే ఆయన ఏకంగా పవన్ కి ఐదు పెళ్లిళ్లు చేశారు. పవన్ కల్యాణ్ కి ఐదుగురు భార్యలను, ఆయన ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారని ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సమోసా తింటే 71 వేల బహుమతి

సమోసాలు అంటే ఇష్టపడని ఇండియన్స్ ఉండరు. ఇందులో అనేక రకాలు ఉండగా.. వాటిని బాగా ఇష్టంగా తింటుంటారు. ఇందులో చిన్న వాటి నుంచి కొంచెం పెద్ద వాటి వరకు ఉండడం అందరికీ తెలిసిందే. కానీ మరీ పెద్దగా చేసే సమోసాలు చాలా అరుదు. తాజాగా 12 కిలోల బరువు ఉన్న బాహుబలి సమోసాను తయారు చేయగా.. దాన్ని 30 నిమిషాల్లో తినేస్తే.. 71 వేల రూపాయలు ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మార్కెట్ కబుర్లు

ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 9 పాయింట్లు లేదా 0.05 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,906 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చరిత్ర  సృష్టించిన సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి

ఇండోనేషియా ఓపెన్‌లో భారత దేశానికి చెందిన సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి చరిత్ర సృష్టించింది. వీరు పురుషుల డబుల్స్‌ విభాగంలో ట్రోఫీని గెలుచుకున్నారు. హోరా హోరీగా సాగిన ఫైనల్​లో ఏడో సీడ్‌ భారత జంట 21-17, 21-18 తేడాతో మలేషియాకు చెందిన ఆరోన్ చియా – వుయ్ యిక్ సో జోడీని చిత్తు చేసి విజేతగా నిలిచింది.. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పోలీస్‌గా కాజల్‌

ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటివరకు చేయని సీరియస్ పోలీస్ పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ సినిమా గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీఈసెట్‌-2023 ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 20న ఏపీఈసెట్‌-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జేఎన్‌టీయూకే ఉపకులపతి, ఏపీఈసెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు ఆదివారం (జూన్ 18) ఒక ప్రకటలో తెలిపారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికోసం 101 పరీక్ష కేంద్రాలు కేంద్రాలు కేటాయించినట్లు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రాతపరీక్షల పూర్తి షెడ్యూల్‌

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9,210 టీచర్లు, లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల పూర్తి షెడ్యూల్‌ను గురుకుల నియామక బోర్డు జూన్ 18న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1 నుంచి 22 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీఆర్‌టీ) నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు; రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు; ఇక మూడో సెషన్ పరీక్షలు సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget