అన్వేషించండి

Satyabhama: వయొలెంట్ పోలీస్‌గా కాజల్ అగర్వాల్ - ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా!

కాజల్ అగర్వాల్ కొత్త సినిమా ‘సత్యభామ’ టైటిల్ గ్లింప్స్ విడుదల అయింది.

ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటివరకు చేయని సీరియస్ పోలీస్ పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ సినిమా గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. గూఢచారి, మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక గ్లింప్స్ విషయానికి వస్తే... ఇద్దరు క్రిమినల్స్ దగ్గర నుంచి నిజం చెప్పించడానికి పోలీసులు ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు కాజల్ వారి మొహాన్ని పచ్చడి చేసి నిజం చెప్పిస్తారు. అయితే వారిని కొట్టేటప్పుడు కాజల్ గాజు ఒకటి తన చేతికే గుచ్చుకుంటుంది. చేతి నుంచి రక్తం కారుతూనే పోలీస్ రిజిస్టర్‌లో సంతకం పెడతారు. పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ ‘గాజులు తీసేసి కొట్టాల్సింది మేడం.’ అన్నప్పుడు పక్కనే ఉన్న ఎస్సై వైపు తిరిగి ‘గాజులు వేసుకోకుండా కొట్టాడుగా... నిజం చెప్పారా?’ అని జుట్టు ముడి వేసుకుంటూ వెళ్లిపోతారు.

దీన్ని బట్టి ఈ సినిమాను మంచి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఆరం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్కా, శ్రీనివాసరావు తక్కెళ్లపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. స్క్రీన్‌ప్లేను శశి కిరణ్ తిక్కా రాశారు.

మరోవైపు నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’లో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కూడా ఇటీవలే విడుదల అయింది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

ఎన్‌బికె... నందమూరి బాలకృష్ణ... ఇదీ నటసింహం పేరు. సినిమాలో కూడా ఆయన పేరు ఎన్‌బికె. అంటే... నెలకొండ భగవంత్ కేసరి. టీజర్ చూస్తే ఎన్‌బికె ఊచకోత ఎలా ఉంటుందో ఈజీగా అర్థం అవుతుంది. బియాండ్ యువర్ ఇమాజినేషన్... ప్రేక్షకుల ఊహలకు అందని రీతిలో 'భగవంత్ కేసరి' సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా అనిల్ రావిపూడి చెప్పేశారు.

'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు' అని బాలకృష్ణ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్, గ్రాండ్ సింగ్ విజువల్స్ కూడా చూపించారు. అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు. 'ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది' అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్!

విలన్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal)ను సైతం టీజర్‌లో చూపించారు. స్టార్టింగ్ విజువల్స్ చూస్తే... ఆయన ఓ స్టిక్ సాయంతో నడుస్తూ కనిపించారు. ఆ మంది మార్బలం చూస్తే సంపన్నుడు అని అర్థం అవుతోంది. తమన్ నేపథ్య సంగీతం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. హీరోయిన్ కాజల్ & లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీలను చూపించలేదు. ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు. బాలకృష్ణ మాస్ మేనరిజమ్స్ తో అనిల్ రావిపూడి సినిమా తీసినట్టు ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
Mahesh Babu Varanasi : వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget