అన్వేషించండి

తెలుగు రాష్ట్రాల్లో సోమ, మంగళవారం మరింత మంటలు- అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న ఐఎండీ

సోమ, మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని ఐఎండీ చెబుతోంది. ప్రజలకు జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగానే నమోదు అయ్యే ఛాన్స్.

చినుకు జాడ లేదు... ఎండలతో ఠారెత్తిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఈ రెండు రోజులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఏపీ తెలంగాణలోనే కాదు పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, బిహార్‌, ఒడిశా, తమిళనాడులో ఇది పరిస్థితి కనిపిస్తోంది. వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు. 

వడగాలులు తీవ్రం 

సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని ఐఎండీ చెబుతోంది. ప్రజలకు జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగానే నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. చల్లని ప్రదేశాల్లో ఉండేందుకు ట్రై చేయాలని సూచిస్తోంది. చిన్నారులు, వృద్దులు, గర్భణిలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. నీళ్లు ఎక్కువ తాగాలని సూచిస్తోంది. 

 

ఎల్లో అలర్ట్

తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో భారీగా వడగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ 4ం డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతుల రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. 

ఈ ప్రాంతం వాళ్లు జాగ్రత్త

ఆదివారం 16 జిల్లాల్లోని 39 మండలాల్లో వడగాలులు వీచాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 24 మండలాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యాయి. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రత కన్నా 6.5 డిగ్రీలపైగా నమోదైంది. ఈ జాబితాలో పెద్దపల్లి జిల్లాలో 6 మండలాలు, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 3 చొప్పున, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో 2 చొప్పున,భువనగిరి, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కో మండలాలు ఉన్నాయి. 

 

ఏపీలో అదే పరిస్థితి

ఏపీలో పరిస్థితి చూస్తే 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. 23 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరించింది. బాపట్ల, అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో  44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేస్తోంది. బిపర్‌జోయ్‌ తుపాను కారణంగా తలెత్తిన పరిస్థితులతో మరో 12 గంటలు వాతావరణం ఇలానే ఉండొచ్చు. 

ఉత్తరాదిలో భిన్న వాతావరణం

గుజరాత్‌ను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను ప్రభావం ఇప్పుడు రాజస్థాన్, అసోంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తోంది. రాజస్థాన్ లో వరద పరిస్థితి కొనసాగుతుండగా, అసోంలోని మూడు జిల్లాలు వరద నీటిలో మునిగిపోయాయి. రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రజలకు ఉపశమనం లభించింది. 

 

రెండు రోజుల్లో వానలు

రానున్న రెండు రోజుల్లో బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంటే మరో రెండు రోజుల్లో ఈ రాష్ట్రాలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. సోమవారం దేశ రాజధానిలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

 

అసోంను ముంచేస్తున్న వర్షాలు 

అసోంలో బ్రహ్మపుత్ర నది ఉధృతి కొనసాగుతోంది. అసోంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని మూడు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. అంతే కాదు, 25 గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. అసోం  అంతటా 215.57 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 37,535 మంది వరదల బారిన పడ్డారు. రాజస్థాన్ లో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. బిపర్జోయ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజస్థాన్‌లోని జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం 59 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Streambox QLED TV: ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొంటే టీవీ ఫ్రీ! - ఇదెక్కడి మాస్ ఆఫర్ అయ్యా!
Embed widget