Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
Satwiksairaj Rankireddy and Chirag Shetty vs Aaron Chia and Soh Wooi Yik: ఇండోనేషియా ఓపెన్‌లో భారత దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి చరిత్ర సృష్టించింది. వీరు పురుషుల డబుల్స్ విభాగంలో ట్రోఫీని గెలుచుకున్నారు. హోరా హోరీగా సాగిన ఫైనల్లో ఏడో సీడ్ భారత జంట 21-17, 21-18 తేడాతో మలేషియాకు చెందిన ఆరోన్ చియా – వుయ్ యిక్ సో జోడీని చిత్తు చేసి విజేతగా నిలిచింది..
మొదటి సారి విజయం
దీంతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన మొదటి భారత జోడీగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రికార్డు సృష్టించారు. మొదటి సెట్‌ను భారత ద్వయం 21-17తో గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన రెండో సెట్‌లో 21-18 తేడాతో విజయం సాధించి మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది. మలేషియాకు చెందిన ఆరోన్ చియా – వుయ్ యిక్ సో జోడీపై ఇంతకు ముందు వరకు స్వాతిక్, చిరాగ్‌ల రికార్డు పేలవంగా ఉంది. వీరు ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడగా, ఎనిమిదింట్లోనూ మలేషియా ద్వయమే గెలిచింది. కానీ కీలక మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పై చేయి సాధించారు.
Into the history books, again 😍🏆
— BAI Media (@BAI_Media) June 18, 2023
📸: @badmintonphoto@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#IndiaontheRise#Badminton pic.twitter.com/ELNFTIPlsi
హోరాహోరీగా సాగిన సెమీస్
అంతకు ముందు శనివారం హోరా హోరీగా సాగిన సెమీ ఫైనల్లో ఏడో సీడ్ భారత జంట సాత్విక్, చిరాగ్ 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె జోడీని చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దీంతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు చేరుకున్న మొదటి భారత జోడీగా వీరు రికార్డు సృష్టించారు. ఈ సెమీస్ మ్యాచ్ ఏకంగా 67 నిమిషాల పాటు సాగడం విశేషం. మొదటి సెట్‌ను భారత జోడీ 17-21తో కోల్పోయింది. కానీ మిగతా రెండు సెట్లలో హోరాహోరీగా పోరాడి 17-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది.
ఇక క్వార్టర్‌లో క్వార్టర్లో సాత్విక్, చిరాగ్ డామినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే! 6-6తో స్కోరు సమంగా ఉన్నప్పుడు అటాకింగ్ గేమ్‌తో చెలరేగారు. వరుసగా 6 పాయింట్లు సాధించి 14-7తో ఆధిపత్యం చెలాయించారు. అదే ఊపులో 21-13తో తొలి గేమ్ ఖాతాలో వేసుకున్నారు. రెండో గేమ్‌లోనూ స్కోరు 7-7తో సమమైంది. ఆపై భారత జోడీని ఆపడం ప్రత్యర్థి తరం కాలేదు. వరుసగా 2, 3 పాయింట్లు సాధిస్తూ 21-13తో గేమ్‌తో పాటు మ్యాచునూ కైవసం చేసుకున్నారు.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🥇
— BAI Media (@BAI_Media) June 18, 2023
Proud of you boys 🫶
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#BWFWorldTour #IndiaontheRise#Badminton pic.twitter.com/dbcWJstfVk
Super 1000 ✅
— BAI Media (@BAI_Media) June 18, 2023
Super 750 ✅
Super 500 ✅
Super 300 ✅
Super 100 ✅@satwiksairaj & @Shettychirag04 have won atleast one of each 🫶🔥#IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#BWFWorldTour #IndiaontheRise#Badminton