అన్వేషించండి

Top Headlines Today: ఐక్యంగా ఉంటే కాంగ్రెస్‌కు విజయావకాశాలు- వైసీపీ లీడర్ల టెన్షన్ దేనికీ? మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

ఐదు వేళ్లు కలుస్తాయా?

కర్ణాటక ఫలితాల తర్వాత హస్తం పార్టీకి కొత్త ఊపొచ్చింది. దశాబ్దం కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా  అధికారంలోకి రావాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గులాబీ పార్టీకి ఓటమి రూచి చూపించాలని కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పని చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐక్యమత్యంగా సాగుతున్నారు. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి నేతల్ని ఆహ్వానించడంతో పాటు పార్టీ వీడిన సీనియర్లకు మళ్లీ టచ్ లోకి వెళ్లింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణరావు, మైనంపల్లి హనుమంతరావు వంటి నేతలు చేరికతో కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా బలం పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

'

మేనిఫెస్టో టెన్షన్

మేనిఫెస్టోలో 99 శాతం  హామీలను నెరవేర్చామని వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కానీ ప్రధానమైన సీపీఎస్ రద్దు, మద్యనిషేధం,  జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఇలా చెప్పుకూంటూ పోతే.. ఓ పెద్ద చాంతాడంత లిస్ట్ కనిపిస్దోంది. గతంలో మద్యాన్ని స్టార్ హోటళ్లకు పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని సీఎం జగన్ సహా మంత్రులు ప్రకటించారు. కానీ ఇప్పుడు మద్యనిషేధం మాటే లేదు. పైగా మద్యం ఆదాయాన్ని వచ్చే పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టి బాండ్లు... ఇతర మార్గాల్లో అప్పులు తీసుకు వచ్చారు. సీపీఎస్ రద్దు చేస్తే అప్పులు దొరకవని బుగ్గన అసెంబ్లీలో చేతులెత్తేశారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ గురించి అసలు ఊసు లేదు. ఇలాంటి వాటిపై ప్రజల్లో వచ్చే ప్రశ్నలకు  సమాధానాలివ్వడమే కొత్తగా ఇచ్చే మేనిఫెస్టోపై నమ్మకం కలిగించాల్సి ఉంది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

భారీగా నామినేషన్లు పడే చాన్స్

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అందులో తెలంగాణ షెడ్యూల్ కూడా ఉంది. కానీ తెలంగాణది ఈ జాబితాలో చివరి స్థానం. అంటే.. నామినేషన్ల తేదీ ప్రారంభమయ్యేది నవంబర్ మూడో తేదీన. అంటే మూడు వారాల  కన్నా ఎక్కువ సమయం ఉంది. సాధారణంగా రాజకీయ పార్టీలు షెడ్యూల్ ప్రకటనను కాకుండా.. నామినేషన్ల గడువు వరకూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తాయి. ఎందుకంటే అభ్యర్థులు చాలా ముఖ్యం. పోటీ పడేవారిలో అత్యుత్తమం అనుకున్న వారిని ఎంపిక చేసుకుని రంగంలోకి  దిగుతాయి. అప్పటి వరకూ సభలు, సమావేశాలు పెట్టినా.. అంత జోరుగా ఉండవు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఒక్కటే మినహాయింపు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చంద్రబాబుకు అస్వస్థత

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో జైల్లో డీహైడ్రేషన్కు గురయ్యారు. నాలుగు రోజులుగా ఎండతీవ్రత పెరగడంతో డీహైడ్రేషన్ బారినపడ్డారు. ఉక్కపోత విషయాన్ని జైలు వైద్యాధికారుల తెలియజేశారు. ములాఖత్ లో కుటుంబసభ్యులకు తెలిజయేశారు చంద్రబాబు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ. 32 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉన్నారు చంద్రబాబు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కేసీఅర్‌ ప్రచారం షెడ్యూల్

తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యుల్ ను బీఆర్ఎస్ విడుదల చేసింది. అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. నవంబర్‌ 9న కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. గజ్వేల్ లో మధ్యాహ్నం 1 - 2 గంటల మధ్య నామినేషన్, అదే రోజు మధ్యాహ్నం 2- 3 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అమరావతిపై మంత్రి హాట్ కామెంట్స్ 

రాజధాని అమరావతి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. రాజధాని వేదికగా రాజకీయం నడుస్తూనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాజధాని అంశం మరోసారి తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని వ్యవహారం కూడా కీలకంగా మారనుంది. దీంతో అమరావతిపై రాజకీయ నేతలు ఎప్పుడూ ఏదోక కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దసరా నుంచి సీఎం జగన్ అమరావతిని విడిచిపెట్టి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రుషికొండపై సీఎం క్యాంపు ఆఫీస్‌తో పాటు ఇల్లు కూడా దాదాపు పూర్తయింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

వాయిదాల పర్వం

తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్ కు వాయిదా వేయడం తెలిసిందే. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి వచ్చే ఏడాదికి గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని సమావేశంలో కమిషన్ నిర్ణయించింది. కొత్త తేదీల ఖరారుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రెండో మ్యాచ్

వరల్డ్ కప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో తలపడనున్న భారత జట్టు ప్లేయింగ్-11లో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్‌ను రిజ్వర్‌ బెంచ్‌కు పరిమితం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు టీమ్ఇండియా అవకాశం ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఇక్కడి పిచ్ గత మ్యాచ్ (చెపాక్) పిచ్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

విజయ్ దేవరకొండ యుద్ధం

'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు యువతలో మంచి క్రేజ్ ఉంది. కానీ, ఇప్పటి వరకు ఆయన యాక్షన్ హిట్ అందుకోలేదు. అదేనండీ... మాంచి యాక్షన్ సినిమా చేసి విజయాన్ని సొంతం చేసుకోలేదు. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్', లేటెస్ట్ 'ఖుషి' వరకు అన్ని సినిమాల్లోనూ ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వైజయంతీ మూవీస్ వార్నింగ్

వైజయంతీ మూవీస్ సంస్థ మంగళవారం 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకు సంబంధించి లీగల్ పబ్లిక్ నోటీసు ఇష్యూ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్‌ని అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మోరల్ రైట్స్, క్యారెక్టర్ రైట్స్, స్టోరీ రైట్స్, మ్యూజిక్ రైట్స్.. ఇలా సర్వహక్కులు తమ సొంతమని పేర్కొన్నారు. ఆ సినిమా ఆధారంగా రీమేక్, సీక్వెల్, ప్రీక్వెల్, వెబ్ సిరీస్ లాంటివి తీయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Manjummel Boys: 'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
YS Sharmila Letter To CM Jagan :  ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
Mrunal Thakur: ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Mumbai Indians Highlights | ఫ్రెజర్ ఊచకతో..ముంబయి 6వ ఓటమి | ABP DesamMalkajgiri Congress MP Candidate Sunitha Mahender Reddy | ఈటెల నాన్ లోకల్..నేను పక్కా లోకల్ | ABPKadiyam Srihari vs Thatikonda Rajaiah | మందకృష్ణ మాదిగపై కడియం శ్రీహరి ఫైర్.. ఎందుకంటే..! | ABPMamata Banerjee Falling Inside Helicopter |మరోసారి గాయపడిన దీదీ..ఏం జరిగిందంటే..! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఆరెస్సెస్ భావజాలాన్ని అమలు చేయడానికే రిజర్వేషన్లు రద్దు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Manjummel Boys: 'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
'మంజుమ్మెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు, ఎక్కడంటే?
YS Sharmila Letter To CM Jagan :  ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పండి.. జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ
Mrunal Thakur: ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
ఆ సీన్ చేసేందుకు మృణాల్‌కు 3 గంటలు పట్టిందట, చివరికి మాజీ ప్రియుడిని ఊహించుకుని..
IPL 2024: శివాలెత్తిన ఢిల్లీ బ్యాటర్లు, ముంబై లక్ష్యం 258
శివాలెత్తిన ఢిల్లీ బ్యాటర్లు, ముంబై లక్ష్యం 258
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
TSRTC సిబ్బందిపై వరుస దాడులతో సజ్జనార్ కీలక ప్రకటన - నిందితులకు జైలుశిక్ష, జరిమానా
Fact Check : జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
జగన్ మేనిపెస్టో ప్రకటన చూస్తున్న చంద్రబాబు ఫోటో వైరల్ - నిజమెంత ?
Ramayan Leaks: రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
రణ్‌బీర్‌ 'రామాయణ్' సెట్‌‌ నుంచి ఫోటోలు లీక్‌ - సీతగా సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా? 
Embed widget