Vijay Devarakonda : విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా 'యుద్ధం'?
Vijay Devarakonda New Movie Title : విజయ్ దేవరకొండ హీరోగా 'దిల్' రాజు నిర్మించబోయే ఓ సినిమా మాఫియా & యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది.
![Vijay Devarakonda : విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా 'యుద్ధం'? Vijay Devarakonda Ravi Kiran Kola Dil Raju movie titled Yuddham? Vijay Devarakonda : విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా 'యుద్ధం'?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/11/e25b824b0cec545acba57a646e825e411696993364732313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు యువతలో మంచి క్రేజ్ ఉంది. కానీ, ఇప్పటి వరకు ఆయన యాక్షన్ హిట్ అందుకోలేదు. అదేనండీ... మాంచి యాక్షన్ సినిమా చేసి విజయాన్ని సొంతం చేసుకోలేదు. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్', లేటెస్ట్ 'ఖుషి' వరకు అన్ని సినిమాల్లోనూ ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది.
'లైగర్'తో విజయ్ దేవరకొండ యాక్షన్ ట్రై చేశారు. ఆ సినిమా కోసం ప్యాక్డ్ బాడీ బిల్డ్ చేశారు. కానీ, హిట్టు పడలేదు. అంతకు ముందు 'నోటా' అంటూ రాజకీయ నేపథ్యంలో డిఫరెంట్ సినిమా చేశారు. అదీ వర్కవుట్ కాలేదు. ఈసారి మాత్రం హిట్టు పడాలని పక్కా ప్లానింగుతో 'దిల్' రాజు నిర్మాణంలో యాక్షన్ సినిమా టేకప్ చేశారట!
రవి కిరణ్ కోలా దర్శకత్వంలో...
'రాజా వారు రాణి గారు'తో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన యువకుడు రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola). ఆ సినిమా తర్వాత దర్శకుడిగా మరో సినిమా చేయలేదు. అయితే... విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం'కు కథ అందించారు. ఇన్నాళ్ళకు కొత్త సినిమా ప్రకటించారు. ఇటీవల రవి కిరణ్ కోలా దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు 'దిల్' రాజు, శిరీష్ ఓ సినిమా ప్రకటించారు. అందులో హీరో ఎవరు? అనేది చెప్పలేదు. కానీ, విజయ్ దేవరకొండతో ఆ సినిమా తీస్తున్నారని ఇండస్ట్రీకి తెలుసు.
విజయ్ దేవరకొండ 'యుద్ధం'!
Vijay Devarakonda New Movie Titled Yuddham? : విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించే సినిమా మాఫియా నేపథ్యంలో 80వ దశకంలో సాగే కథతో రూపొందుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం. ఈ సినిమాకు 'యుద్ధం' అనే టైటిల్ ఖరారు చేశారట.
'యుద్ధం' పేరుతో సూపర్ స్టార్ కృష్ణ 1984లో ఓ సినిమా చేశారు. తరుణ్, యామీ గౌతమ్ జంటగా నటించిన సినిమా సైతం 'యుద్ధం' పేరుతో విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఈ టైటిల్ రాలేదని చెప్పాలి.
Also Read : మైత్రికి 'సలార్' నైజాం - ఇది ఏషియన్ సునీల్, 'దిల్' రాజుకు గట్టి పోటీయే!
విజయ్ దేవరకొండ లుక్ నుంచి ఆయనను ప్రజెంట్ చేసే తీరు వరకు ప్రతిదీ కొత్తగా ఉంటుందట. మాఫియాలో ఎంటరైన ఓ సామాన్యుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? అనేది 'యుద్ధం' స్టోరీ లైన్ అని, రెగ్యులర్ స్టైల్ కాకుండా కొత్తగా ఉంటుందని టాక్.
Also Read : బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలకు వస్తే... 'గీత గోవిందం' తర్వాత ఆ చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్లతో మరో సినిమా చేస్తున్నారు. దానినీ 'దిల్' రాజు నిర్మిస్తున్నారు. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. దానికి 'ఫ్యామిలీ స్టార్' లేదా 'కుటుంబరావు' టైటిల్ ఖరారు చేసే ఛాన్స్ ఉంది. 'మళ్ళీ రావా', 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న స్పై థ్రిల్లర్ కూడా చేస్తున్నారు. రవి కిరణ్ కోలా సినిమా ఒకటి ఉంది. ఈ మూడు కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)