అన్వేషించండి

చంద్రబాబుకు అస్వస్థత, ఎండ తీవ్రతతో డీహైడ్రేషన్!

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎండతీవ్రతతో జైల్లో డీహైడ్రేషన్కు గురయ్యారు. నాలుగు రోజులుగా ఎండతీవ్రత పెరగడంతో డీహైడ్రేషన్ బారినపడ్డారు. ఉక్కపోత విషయాన్ని జైలు వైద్యాధికారుల తెలియజేశారు. ములాఖత్ లో కుటుంబసభ్యులకు తెలిజయేశారు చంద్రబాబు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ. 32 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉన్నారు చంద్రబాబు. 

మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు వాడీ వేడిగా కొనసాగాయి. 17ఎ సెక్షన్‌ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే కోర్టు ముందుంచారు. రఫేల్‌ కొనుగోళ్లపై యశ్వంత్‌ సిన్హా వేసిన పిటిషన్‌, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను వివరించారు. రఫేల్‌ కేసులో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఫేల్‌ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్‌ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ కొట్టివేయాలని కోరారు. 17ఎను అవినీతిని నిరోధించేందుకు తీసుకొచ్చారన ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. భారీ ఎత్తున అవినీతి జరిగినప్పుడు, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కేవలం అధికార విధుల నిర్వహణగా పరిగణించలేమన్నారు. 17ఎ సవరణ నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదని కోర్టుకు తెలిపారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఏంటి ?
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. 

చంద్రబాబుపై ఉన్న కేసులు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రథమ ముద్దాయిగా ఉన్నారు. పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాత్ర ముసుగులో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల హత్యకు కుట్ర పన్ని, మారణాయుధాలు, బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారని పోలీసులు అభియోగాలు మోపారు.  అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గత ఏడాది ఏప్రిల్ లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సీఐడీ చెబుతోంది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా పేర్కొన్న సీఐడీ, నారా లోకేష్ ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఫైబర్‌ నెట్‌ కేసులో రూ.115 కోట్ల నిధులు దారిమళ్లించారని సిట్‌ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. 2019లోనే ఈ కేసులో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. ఈ కేసులో A1గా వేమూరి హరి ప్రసాద్‌, A2 మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారని పేర్కొంది. అయితే వేమూరి హరిప్రసాద్‌ చంద్రాబబుకు అత్యంత సన్నిహితుడని ఆరోపించింది. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను ఉన్నట్లు సీఐడీ అభియోగాలు మోపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget