అన్వేషించండి

Top Headlines Today: జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ; మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే పల్లా! - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. సిద్దిపేటలోని  హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ (TS Minister Konda Surekha) ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న జాతర (Komuravelli Jatara ) ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ నేతను స్టేజీ పైకి పిలిచారు. ఓడిపోయిన వారిని స్టేజీ మీదకి ఎలా పిలుస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పల్లా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంకా చదవండి

'మెగా డీఎస్సీ' ద్వారా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేపట్టండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు కొత్త సంవత్సర శుభవార్త వినిపించారు. మెగా డీఎస్సీ (TS Mega DSC) ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై డిసెంబరు 30న సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలో విద్యా వ్యవస్థలోని సమస్యలపై చర్చించారు. టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా చదవండి

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! 2023లో ఏపీలో ఏం జరిగిందంటే!

మరో రోజులో 2023 సంవత్సరం ముగిసి కొత్త ఆంగ్ల సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందని ఓసారి వెనక్కు తిరిగి చూసుకొంటే, కోర్టు కేసులు, చంద్రబాబు నాయుడు అరెస్టు, నారా లోకేష్ యువగళం, విశాఖ రాజధాని పేరుతో వైసీపి నేతలు చేసిన ప్రచారం కనిపిస్తుంది. ఇంకా చదవండి

ఆ విషయం మీరు మరిచినా నేను మరిచిపోలేదు

అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. ఈమేరకు ఆయన సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు లోకేష్. వారి అలసత్వానికి బాధితులు బలైపోతున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా.. అగ్రిగోల్డ్ తరపున అప్పటి ప్రతిపక్షనేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. అప్పుడు తమపై విమర్శలు చేసి, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు. ఇంకా చదవండి

వచ్చే ఏడాది కూడా లేఆఫ్‌లు ఉంటాయా?

కొవిడ్ తరవాత బాగా కుదుపులు వచ్చిన రంగమేదైనా ఉంటే అది ఐటీయే. ఇప్పటికీ ఈ ఇండస్ట్రీ కోలుకోలేదు. ఆశించిన స్థాయిలో గ్రోథ్‌ రేట్ కనిపించడం లేదు. ప్రాజెక్ట్‌లు తగ్గిపోయాయి. ఫలితంగా కంపెనీలు క్రమంగా వర్క్‌ ఫోర్స్‌ని (IT Layoffs 2024) తగ్గించుకోడం మొదలు పెట్టాయి. అందులో భాగంగానే Layoffలు ప్రకటించాయి. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచే ఈ కోతలు మొదలయ్యాయి. దాదాపు ఏడాదిగా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. బడా కంపెనీలన్నీ వేలాది సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపాయి. ప్రస్తుత ట్రెండ్‌ని చూస్తుంటే లేఆఫ్‌లు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. ఎలాగో 2023 గడిచిపోయింది. ఇంకా చదవండి

అయోధ్యలో వాల్మీకి ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించిన ప్రధాని

అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అయోధ్య ధామ్‌గా (Maharishi Valmiki International Airport Ayodhya Dham) నామకరణం చేసింది ప్రభుత్వం. రూ.1,450 కోట్లతో నిర్మించిన ఈ విమానాశ్రయానికి దేశంలోని నలుమూలల నుంచి ఫ్లైట్ సర్వీస్‌లు నడవనున్నాయి. జనవరి 6 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఏటా 10 లక్షల మంది ప్యాసింజర్స్‌ వినియోగించుకునేలా నిర్మించారు. ఇంకా చదవండి

ఎంటర్‌టైనింగ్, ఎమోషనల్‌గా ‘#90's’ ట్రైలర్

దేశంలోని మిగతా భాషల్లో కంటే తెలుగులో వెబ్ సిరీస్‌ల సంఖ్య తక్కువే. గత నెలలోనే అమెజాన్ ప్రైమ్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన ‘దూత’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈటీవీ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్ తెలుగులో కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘#90's ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’. బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, ప్రముఖ యూట్యూబర్ మౌళి ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ట్రైలర్‌ను ఇప్పుడు విడుదల చేశారు. ఇంకా చదవండి

బన్నీ పాటను మహేష్‌కు కొట్టిన తమన్, కుర్చీ మడతపెట్టి కాపీయే

'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ మీద నెట్టింట బోల్డంత  డిస్కషన్ జరుగుతోంది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఓ ముసలాయన బూతు మాట చెబితే ఆ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆ బూతు పదం మీద పాట ఏంటని కొందరు జనాలు విమర్శలు చేస్తున్నారు. సాహిత్యానికి, తెలుగు భాషకు ఎంతో విలువ ఇచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు ఆ పాటను ఎలా ఓకే చేశారని ప్రశ్నిస్తున్నారు. అది పక్కన పెడితే... ఇంకా చదవండి

అర్జున, ఖేల్‌రత్న అవార్డులను పేవ్‌మెంట్‌పై వదిలేసిన వినేష్ ఫోగట్ - న్యాయం జరగలేదనే!

ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ షోగట్ తన అవార్డులను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట వదిలేయడానికి ప్రయత్నించారు. అయితే ఆమెను కర్తవ్య పథ్ వద్ద పోలీసులు అడ్డగించారు. దీంతో వినేష్ ఫోగట్ తన అవార్డులను కర్తవ్య పథ్ వద్ద పేవ్‌మెంట్‌పై వదిలేశారు. ఇంకా చదవండి

జనవరి 1న అన్ని బ్యాంక్‌లకు సెలవు, వచ్చే నెలలో 16 రోజులు పని చేయవు

జనవరి 1వ తేదీన దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. కాబట్టి, ఆదివారంతోపాటు సోమవారం కూడా బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి. 2024 జనవరిలో, ఆదివారాలు. రెండో, నాలుగో శనివారాలు, పండుగలు, పబ్బాలు కలుపుకుని మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఇంకా చదవండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Embed widget