అన్వేషించండి

CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత

Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. 1000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్రూప్ 4 నియామక పత్రాలు అందజేశారు

Revanth Reddy participates in Yuva Vikasam - Praja Vijayotsavalu at Peddapalli : తెలంగాణ ఉద్యమం మొదలైందే ఉద్యోగాల కోసమని, ప్రజలకు ఉపాధి కోసం.. మన ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్రం సాధించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవు పెద్దపల్లిలో యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు వర్చువల్‌గా దాదాపు 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు చేశారు.

తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం మొదలైంది. ఏడాదిలో 55,143 ఉద్యోగాలను అందించి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. గ్రూప్-4 లో ఎంపికైన 8,084 మందికి యువ వికాసం వేదికపై నియామక పత్రాలు అందించినందుకు సంతోషంగా ఉంది. 25 ఏళ్లలో మోదీ గుజరాత్ లో మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా ? చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

కేసీఆర్ మా నాయకులను జైల్లో పెట్టారు

కరీంనగర్ గడ్డపై కాలు పెట్టినప్పుడల్లా ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే నమ్మకాన్ని కలిగించిన సోనియమ్మ గుర్తుకు వస్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియమ్మ తెలంగాణ కలను సాకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది.. మన ఉద్యోగాల కోసం.. ప్రజలకు ఉపాధి కోసం.. మన ప్రాంత అభివృద్ధి కోసం. పెద్దపల్లి రైతుల కోసం కొట్లాడితే ఆనాడు మా నాయకులను కేసీఆర్ జైల్లో పెట్టారు. ఆనాడు ఏ ప్రాజెక్టుల కోసం కొట్లాడామో.. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం మనకు వచ్చింది. ప్రజా పాలన వల్లే రూ.1035 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నాం. కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే కొందరు వాళ్ల భవిష్యత్ చీకటి అవుతుందని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. 10 నెలల మా పాలనపై వాళ్లు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ పది రోజుల్లో తిప్పి కొడదాం. 

వరి వేసుకుంటే ఉరి అన్నారు కేసీఆర్

వరి వేసుకుంటే ఉరే అని మాట్లాడిన చరిత్ర కేసీఆర్ ది. మీరు వడ్లు పండించండి.. సన్నాలు వేయండి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 33 జిల్లాల్లో అత్యధికంగా 2 లక్షల ఎకరాల్లో సన్న వడ్లు పండించిన ఘనత పెద్దపల్లి జిల్లాది. 95 శాతం రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయి. అక్షరాల 1లక్ష రెండువేల కోట్లు కాంట్రాక్టర్లు మెక్కితే.. కేసీఆర్ బుక్కితే కాళేశ్వరం కూలిపోయింది. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో లెక్క తీద్దాం రా.. అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకపోయినా.. 1 కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించింది. 25లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది..గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా ఎవరు చర్చకు వస్తారో రండి. ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించాం. 

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకున్నాం. ఆడబిడ్డలను  కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు. మేం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలను బలోపేతం చేసాం. శాతవాహన యూనివర్సిటీకి  ఇంజనీరింగ్,  లా కాలేజీ కావాలని కోరారు... వాటిని ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కనీసం సమస్యలపై ధర్నా చేసుకోలేనంత నిర్బంధాల మధ్య తెలంగాణ పదేళ్లు మగ్గిపోయింది. మేం అధికారంలోకి రాగానే ఇందిరా పార్కు లో ధర్నా చౌక్ లో ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించాం. మా పీసీసీ అధ్యక్షుడు వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు.

Also Read: Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం

పదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే విద్యార్థులకు డైట్, చార్జీలు పెంచాం. మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగొద్దనే ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసాం. ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరు...ప్రజలు మాకు ఐదేళ్లు  అవకాశం ఇచ్చారు. పది నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారు.. వాళ్ల దుఃఖం దేనికో అర్థం కావడంలేదు. పదేళ్లు సీఎం గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి... రండి అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వండి.

ఎకరానికి కోటి ఎలా సంపాదించాలి..

ఎకరానికి కోటి ఎలా సంపాదించిన మీ అనుభవాన్ని ప్రజలకు వివరించాలని కేసీఆర్ ను కోరారు. కులగణనలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎందుకు పాల్గొనడం లేదు? అని ప్రశ్నించారు. ఒకవేళ మీరు బీసీ వ్యతిరేకులా.. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? స్పష్టం చేయాలన్నారు. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs nz First Half Highlights | Champions Trophy 2025 Final లో భారత్ దే ఫస్ట్ హాఫ్ | ABP DesamInd vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP DesamInd vs Nz Champions Trophy Final Preview | మినీ వరల్డ్ కప్పును ముద్దాడేది ఎవరో..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Don Lee Birthday: డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టినరోజు, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టినరోజు, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
Amaravati Update: అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం, వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారు
Pavani Karanam: చీరలో పద్ధతిగా ఉన్న బన్నీ అన్న కూతురు!
చీరలో పద్ధతిగా ఉన్న బన్నీ అన్న కూతురు!
Embed widget