BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
BSNL IFTV Free OTT: బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్‌టీవీ ద్వారా మనదేశంలో ఉచితంగా లైవ్ టీవీ ఛానెల్స్, ఓటీటీ ప్లాట్‌ఫాంల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తుంది. ఈ సర్వీస్ దశల వారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
BSNL IFTV: దేశంలోని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశంలో తన నెట్‌వర్క్‌ను మెరుగుపరచడంలో నిమగ్నమై ఉంది. బీఎస్ఎన్ఎల్ దేశంలో తన నెట్‌వర్క్‌ను చాలా వేగంగా విస్తరిస్తోంది. బీఎస్ఎన్ఎల్ దేశంలోనే మొదటిసారిగా ఇంటర్నెట్ టీవీ సర్వీస్ (IFTV)ని ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన ఈ సేవ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సహాయంతో పని చేస్తుంది. ఇప్పుడు వినియోగదారులు ఆప్టికల్ కేబుల్ ద్వారా చాలా వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని కూడా పొందుతారు. తద్వారా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో వచ్చే వినోద కార్యక్రమాలను సులభంగా చూడవచ్చు.
పంజాబ్‌లో కూడా సేవలు ప్రారంభం
అందుతున్న సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త సేవను మొదట మధ్యప్రదేశ్, తమిళనాడులో ప్రారంభించింది. అయితే ఇప్పుడు పంజాబ్‌లోనూ ఈ సర్వీస్‌ను కంపెనీ ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.
బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్‌టీవీ అంటే ఏమిటి?
బీఎస్ఎన్ఎల్ ఐఎఫ్‌టీవీ సర్వీసు కింద కంపెనీ కస్టమర్‌లు స్కై ప్రో టీవీ యాప్ ద్వారా 500 కంటే ఎక్కువ హెచ్‌డీ, ఎస్‌డీ ఛానెల్‌లను ఆస్వాదించవచ్చు. ఇది కాకుండా 20 కంటే ఎక్కువ ఫేమస్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీని అతి పెద్ద ప్రత్యేకత ఏంటంటే ఈ సదుపాయాన్ని పొందడానికి మీకు ఎలాంటి సెట్ టాప్ బాక్స్ అవసరం లేదు.
Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
స్కైప్రోతో చేతులు కలిపిన బీఎస్ఎన్ఎల్
స్కైప్రో సహకారంతో బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ఇంటర్నెట్ టీవీ సేవను నవంబర్ 28వ తేదీన ప్రారంభించింది. ఈ సేవతో బీఎస్ఎన్ఎల్ ఫైబర్ వినియోగదారులు కలర్స్, స్టార్, జీ టీవీ వంటి వినోద ఛానెళ్లను, స్టార్ స్పోర్ట్స్ వంటి స్పోర్ట్స్ ఛానెల్‌లను ఆస్వాదించవచ్చు. ఈ సేవ ఎటువంటి అదనపు పరికరాలు లేదా కేబుల్ లేకుండా పని చేస్తుంది. చండీగఢ్‌లో దీన్ని మొదటి దశలో 8,000 మంది వినియోగదారులకు పరిచయం చేశారు.
చైనా కంపెనీలపై కఠినత్వం
ఒక వైపు బీఎస్ఎన్ఎల్ దేశంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. మరోవైపు చైనా నుంచి దిగుమతి అవుతున్న నాసిరకం పవర్ బ్యాంకులపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే రెండు పెద్ద కంపెనీలపై చర్యలు తీసుకోగా మరో కంపెనీపై విచారణ కొనసాగుతోంది. ఈ కంపెనీలు చైనా నుంచి తక్కువ ధరకు నాణ్యత లేని బ్యాటరీలను కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారులకు నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు దీనిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!
Transforming entertainment in Punjab!
— BSNL India (@BSNLCorporate) November 28, 2024
Hon'ble CMD BSNL launched today IFTV service in Punjab circle, bringing a new era of seamless connectivity and digital entertainment.
BSNL redefines home entertainment with IFTV – India’s First Fiber-Based Intranet TV Service with access to… pic.twitter.com/Qtj0XxVcja