యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అంతరిక్షంలో పనిచేస్తాయా? యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లను అంతరిక్షంలో కూడా ఉపయోగించవచ్చట. అంతరిక్షంలో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తారు. దీని కారణంగా వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో యాక్టివ్‌గా ఉంటారు. తమ రోజువారీ అనుభవాలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. వారు ఇంటర్నెట్‌లో వీడియోలు, ఫోటోలను అప్‌లోడ్ చేస్తారు. దీని కారణంగా భూమి మీద ఉండేవారికి అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. అయితే అంతరిక్షంలో ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో వారు యాక్టివ్‌గా ఉండటానికి అది సరిపోతుంది. అలాగే వ్యోమగాములు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఎంజాయ్ చేయవచ్చు.