అన్వేషించండి

TS Mega DSC: 'మెగా డీఎస్సీ' ద్వారా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేపట్టండి, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు కొత్త సంవత్సర శుభవార్త వినిపించారు. మెగా డీఎస్సీ ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

CM Revanth Reddy Review on Education Dept: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు కొత్త సంవత్సర శుభవార్త వినిపించారు. మెగా డీఎస్సీ (TS Mega DSC) ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై డిసెంబరు 30న సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలో విద్యా వ్యవస్థలోని సమస్యలపై చర్చించారు. టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లలో ఉన్న సమస్యలు, అవాంతరాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని సూచించారు. విద్యాలయాలకు పారిశ్రామిక కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేయకుండా.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.

ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలు..
ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతులను తయారు చేయాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. మహబూబ్ నగర్‌లో కొడంగల్‌లో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, అలాగే, మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారిని సీఎం ఆదేశించారు.

టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు సచివాలయంలో డిసెంబరు 30న భేటీ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై టాటా టెక్నాలజీస్ ప్రతినిధులు రేవంత్‌తో ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రంలో సుమారు రూ.2 వేల కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 22 స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులకు ప్రణాళిక రూపొందించిన టాటా టెక్నాలజీస్.. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఐటీఐ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రతిపాదించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం టాటా టెక్నాలజీస్ సంస్థ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుమారు లక్ష మందికి శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టి.. కాలం చెల్లిన కోర్సుల స్థానంలో ఆధునిక కోర్సులను ప్రవేశ పెట్టాలని సీఎం సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget