అన్వేషించండి

Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?

Top 10 Smartphones in The World: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 స్మార్ట్ ఫోన్ల జాబితాను కౌంటర్‌పాయింట్ అనే రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ఐఫోన్ 15 టాప్‌లో ఉంది.

Top Selling Smartphones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడు చాలా మంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం.

అగ్రస్థానంలో ఐఫోన్ 15
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ... ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏ స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువగా అమ్ముడయ్యాయో తెలుపుతూ నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్ 15 అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఉన్నాయి. ఆసక్తికరంగా 2022లో లాంచ్ అయిన ఐఫోన్ 14 కూడా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.

Also Read: వన్‌ప్లస్ 11ఆర్ 5జీపై భారీ ఆఫర్ - ఏకంగా రూ.8 వేల వరకు తగ్గింపు!

శాంసంగ్ నుంచి ఐదు ఫోన్లు
ఈ జాబితాలో శాంసంగ్ కూడా స్థానాన్ని సంపాదించుకుంది. ఒకటి లేదా రెండు కాదు ఏకంగా ఐదు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. ఇవి ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 ఫోన్ల జాబితాలో ఉన్నాయి. వీటిలో నాలుగు మోడల్‌లు గెలాక్సీ ఏ సిరీస్‌కు చెందినవి. అవి శాంసంగ్ గెలాక్సీ ఏ15 4జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ05, శాంసంగ్ గెలాక్సీ ఏ35. ఇది కాకుండా శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మూడో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

యాపిల్, శాంసంగ్ కాకుండా షావోమీ రెడ్‌మీ 13సీ కూడా ఈ జాబితాలోకి చేరింది. ఈ ఫోన్ 2023 డిసెంబర్‌లో రూ. 10,000 కంటే తక్కువ ధరతో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది వినియోగదారులకు బాగా నచ్చింది.

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న  టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
ఐఫోన్ 15 (iPhone 15)
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)
ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro)
శాంసంగ్ గెలాక్సీ ఏ15 4జీ (Samsung Galaxy A15 4G)
శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ (Samsung Galaxy A15 5G)
శాంసంగ్ గెలాక్సీ ఏ05 (Samsung Galaxy A05)
రెడ్‌మీ 13సీ 4జీ (Redmi 13C 4G)
శాంసంగ్ గెలాక్సీ ఏ35 (Samsung Galaxy A35)
ఐఫోన్ 14 (iPhone 14)
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24)

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో యాపిల్, శాంసంగ్ హవా కొనసాగుతున్నట్లు ఈ జాబితాను బట్టి స్పష్టంగా చెప్పవచ్చు. దీంతో పాటు షావోమీ రెడ్‌మీ 13సీ వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు కూడా కస్టమర్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈ లిస్ట్‌లో ప్రీమియం ఫోన్లు, బడ్జెట్ ఫోన్లు రెండూ ఉన్నాయి కాబట్టి వినియోగదారులు ఫోన్ల విషయంలో ఎంత విభిన్నంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Also Read: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Embed widget