స్మార్ట్ ఫోన్ ఆఫ్ చేసినా లొకేషన్ ట్రాక్ చేయడం సాధ్యమేనా? స్మార్ట్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినా అందులో బ్యాటరీ, కొన్ని హార్డ్ వేర్ పార్ట్‌లు యాక్టివ్‌గానే ఉంటాయి. కాబట్టి ట్రాకింగ్ చేయడం కచ్చితంగా సాధ్యపడుతుంది. కొన్ని స్మార్ట్ ఫోన్లలో హార్డ్ వేర్ లెవల్‌లోనే కొన్ని చిప్స్ ఉంటాయి. దీంతో ట్రాకింగ్ సాధ్యం అవుతుంది. స్మార్ట్ ఫోన్‌ను ఆఫ్ చేసినా కొన్ని స్మార్ట్ ఫోన్లలో జీపీఎస్ ఆన్‌లోనే ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా సిమ్ కార్డు ద్వారా టవర్ లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. మీ స్మార్ట్ ఫోన్‌లో ఏదైనా ట్రోజన్ లేదా మాల్‌వేర్ ఉన్నా దాన్ని ఆఫ్ అయినా ట్రాక్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్‌లో ఫైండ్ మై డివైస్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ స్విచ్ ఆఫ్ చేసిన లొకేషన్ తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్‌ను కూడా బైపాస్ చేసి లొకేషన్ ట్రాక్ చేసే అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ ఏజెన్సీలు స్మార్ట్ ఫోన్లను ఈ విధంగానే ట్రాక్ చేస్తాయి.