అన్వేషించండి

Top Headlines Today: కాళేశ్వరంపై విచారణకు సీఎం ఆదేశం; ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

ఎమ్మెల్సీ కవిత సూచనతో కాళేశ్వరంపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో లక్ష కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతలపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు సిట్టింగ్ జడ్జితో విచారణతో జరిపించి, ఇందుకు బాధ్యులు అందరిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా ప్రాజెక్టు కనిపిస్తుందన్నారు. ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ భూమిపై ఎక్కడ ఉందో అర్థం కావడం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. గతంలో కాంగ్రెస్ నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులు కట్టాము. దశాబ్దాలుగా అన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మా పనితనానికి సజీవ సాక్ష్యాలుగా ఆ ప్రాజెక్టులు నిలిచాయన్నారు. ఇంకా చదవండి

'ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది' - అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారని హరీష్ రావు ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (HarishRao) మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదని, పూర్తి ప్రజాస్వామ్యంగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ (Congress) నేతలు ప్రతిపక్షాల గొంతు నొక్కారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకే కాదని, బీజేపీ, ఎంఐఎం సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం లేదని చెప్పారు. ఇంకా చదవండి

చంద్రబాబుకు అంత సీన్ లేదు, దమ్ముంటే 175 సీట్లలో పోటీ చెయ్: మంత్రి అంబటి

చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా తన హయాంలో ప్రజలకు మేలు చేసి ఉంటే.. రేపటి ఎన్నికల్లో సింగిల్‌గా ఎందుకు పోటీ చేయలేక పోతున్నారు అని టీడీపీ అధినేతను ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దశాబ్దంన్నర కాలం సీఎంగా చేసినా సొంతంగా పోటీ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఎందుకు లేవో ప్రజలకు తెలుసునంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు చేసే పనులు చెప్పుకోలేక, పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగే నేత అంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి

ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగబాబు

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే, ఏపీలో ఎన్నికల సందడి మొదలైనట్లు కనిపిస్తోంది. యువతతో పాటు నేతలు సైతం తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు, జనసేన నేత నాగేంద్ర బాబు ఏపీలో కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు నాగబాబు. ఇంకా చదవండి

ఒఎన్‌డిసి అంటే ఏమిటి? అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌కు ఎలా సవాలు విసురుతుంది?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి బడా ఈ-కామర్స్ సంస్థల ఆధిపత్యానికి చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎన్ డీసీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం దీన్ని 5 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇంకా చదవండి

లోక్‌సభపై దాడి జరగడానికి కారణం మోదీయే, రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ దాడి ఘటనపై (Lok Sabha Security Breach) ప్రతిపక్షాలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ,హోం మంత్రి అమిత్ షా సభలో ఈ దాడి గురించి మాట్లాడాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ స్పందించినప్పటికీ ప్రధాని మోదీ మాట్లాడాలి పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi on Security Breach) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల వల్లే ఈ సమస్య తీవ్రమవుతోందని విమర్శించారు. ద్రవ్యోల్బణమూ పెరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇంకా చదవండి

బడ్జెట్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్న కియా - ఎక్స్‌టర్, పంచ్‌లకు పోటీగా క్లావిస్!

దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ఇటీవల భారతదేశంలో "క్లావిస్" అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ‘క్లావిస్’ పేరును కంపెనీ దాని ఉత్పత్తులకు ఉపయోగించవచ్చు. ఇది రాబోయే కొన్ని సంవత్సరాల్లో లాంచ్ కానుంది. హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా పంచ్‌లకు పోటీగా కియా క్లావిస్ మైక్రో ఎస్‌యూవీ రావచ్చు. ఇది నిజమని తేలితే కొత్త కియా మైక్రో ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్, ఫీచర్లు, ఇంజిన్ హ్యుందాయ్ ఎక్సెంట్‌ను పోలి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది కాకుండా హ్యుందాయ్ వెర్నా ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడే మిడ్ సైజ్ సెడాన్‌ను కియా లాంచ్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే దేశంలో సెడాన్ సెగ్మెంట్ విక్రయాలు భారీగా క్షీణించడంతో ఇది జరుగుతుందో లేదో తెలియరాలేదు. ఇంకా చదవండి

‘మద్యం అలవాటు లేదా... మధ్యాహ్నం అలవాటు లేదు’

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ‘విద్య వాసుల అహం’. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘విద్య వాసుల అహం’ చిత్రానికి 'తెల్లవారితే గురువారం' ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా చదవండి

మాస్ మహారాజాతో నటించే ఛాన్స్ కొట్టేసిన క్లాస్ మహారాణి ఈ అమ్మాయే

మాస్ మహారాజా రవితేజతో మూడో సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెడీ అయ్యారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు 'షాక్', 'మిరపకాయ్' వచ్చాయి. ఆల్మోస్ట్ 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసి సినిమా చేస్తున్నారు. ఇంకా చదవండి

సఫారీలతో వన్డే సవాల్‌, రాహుల్‌ సారథ్యంలో భారత్‌ సిద్ధం

దక్షిణాఫ్రికా పర్యటనలో టీ-20 సిరీస్‌ను సమం చేసిన భారత్.. ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. ఆదివారం జొహన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. కేఎల్ రాహుల్‌ నేతృత్వంలోని యువ భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ను  విజయంతో ఆరంభించాలని పట్టుదలతో ఉంది. వన్డే ప్రపంచకప్‌ తర్వాతటీమిండియా ఆడే తొలి వన్డే సిరీస్‌ ఇదే కావడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Swarna Kuppam Vision 2029 : సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
Tragedy After Game Changer Event: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ చూసి వెళుతూ ఇద్దరు మృతి.. తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ చూసి వెళుతూ ఇద్దరు మృతి.. తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Swarna Kuppam Vision 2029 : సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
Tragedy After Game Changer Event: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ చూసి వెళుతూ ఇద్దరు మృతి.. తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ చూసి వెళుతూ ఇద్దరు మృతి.. తీవ్ర ఆవేదనకు గురైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం
First HMPV Case In India: భారత్‌లో ఒకేరోజు రెండు HMPV Virus కేసులు! బెంగళూరులో చిన్నారులకు పాజిటివ్
భారత్‌లో ఒకేరోజు రెండు HMPV Virus కేసులు! బెంగళూరులో చిన్నారులకు పాజిటివ్
Dil Raju: 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానుల‌కు రూ. 10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన దిల్‌ రాజు
'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానుల‌కు రూ. 10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన దిల్‌ రాజు
Jabardasth Faima: 'జబర్దస్త్' ఫైమాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది... వదల్లేకపోతున్న 'పటాస్' ప్రవీణ్ - స్టేజిపై వెక్కి వెక్కి ఏడుపు
'జబర్దస్త్' ఫైమాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది... వదల్లేకపోతున్న 'పటాస్' ప్రవీణ్ - స్టేజిపై వెక్కి వెక్కి ఏడుపు
Stock Market Crash: స్టాక్‌ మార్కెట్లలో HMPV కేస్‌ భయం - సెన్సెక్స్ 1200, నిఫ్టీ 400 పాయింట్లు క్రాష్‌
స్టాక్‌ మార్కెట్లలో HMPV కేస్‌ భయం - సెన్సెక్స్ 1200, నిఫ్టీ 400 పాయింట్లు క్రాష్‌
Embed widget