Bhagyashri Borse: మాస్ మహారాజాతో నటించే ఛాన్స్ కొట్టేసిన క్లాస్ మహారాణి ఈ అమ్మాయే
Ravi Teja Harish Shankar's new movie actress name: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నటించనుంది.
Bhagyashri Borse Tollywood debut with Ravi Teja movie: మాస్ మహారాజా రవితేజతో మూడో సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెడీ అయ్యారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు 'షాక్', 'మిరపకాయ్' వచ్చాయి. ఆల్మోస్ట్ 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసి సినిమా చేస్తున్నారు.
రవితేజ సరసన బాలీవుడ్ భామ!
Ravi Teja Harish Shankar movie producer: రవితేజ, హరీష్ శంకర్ కలయికలో సినిమాను అతి తక్కువ సమయంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇటీవలే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ నెలలో సెట్స్ మీదకు వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు రవితేజతో రొమాన్స్ చేయబోయే కథానాయికను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
Also Read: కళ్యాణ్ రామ్ 'డెవిల్' చూసిన 'దిల్' రాజు - 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్!
రవితేజ సరసన బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్సే నటించనున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. ఇంతకు ముందు హిందీలో 'యారియాన్ 2' చేశారు. మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి అంటూ హరీష్ శంకర్ ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. లేటెస్ట్ సెన్సేషన్ 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి నుంచి పూజా హెగ్డే వరకు పలువురు పేర్లు కథానాయిక రేసులో వినిపించాయి. ప్రొడక్షన్ హౌస్ గానీ, దర్శక నిర్మాతలు గానీ అధికారికంగా ప్రకటించలేదు అనుకోండి! చివరకు, ఆ అవకాశం భాగ్య శ్రీ బొర్సేను వరించింది.
Also Read: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్
రవితేజ, హరీష్ శంకర్ సినిమా మేకర్స్ విడుదల చేసిన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో భాగ్య శ్రీ బోర్సే చాలా గ్లామరస్ గా ఉన్నారు. చీరలో చాలా క్లాసీగా, అందంగా కనిపించారు. ఈ సినిమాలో మరికొంత మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారని, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు సినిమాకు పని చేస్తున్నారని, త్వరలో వాళ్ళ వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది.
View this post on Instagram
“ Hitting the floors Soon” https://t.co/IIEoJDC7B2
— Harish Shankar .S (@harish2you) December 13, 2023
Dear #Bhagyashri hearty welcome ..you are here to stay and Conquer…. Because you are born to WIN.. wishing you a BlockBuster Career which starts with our film….
— Harish Shankar .S (@harish2you) December 16, 2023
Lots of love and Best wishes
😍😍🤗🤗 pic.twitter.com/DbmY8Tta7x