Devil: కళ్యాణ్ రామ్ 'డెవిల్' చూసిన 'దిల్' రాజు - 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్!
Devil movie distribution rights details: కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమాను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు చూశారని తెలిసింది. దాంతో 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Dil Raju to distribute Devil movie in Andhra: నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... ఉప శీర్షిక. ఇదొక పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్. అభిషేక్ నామా నిరించారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ పరిచయం అవుతున్నారు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
'డెవిల్' చూసిన అగ్ర నిర్మాత 'దిల్' రాజు!
Dil Raju watched Devil movie: 'డెవిల్'ను తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాత 'దిల్' రాజు చూశారని తెలిసింది. సినిమా యూనిట్ ఆయన కోసం స్పెషల్ షో వేసింది. షో పూర్తి అయిన తర్వాత బావుందని హీరో, దర్శక నిర్మాతను 'దిల్' రాజు మెచ్చుకోవడం మాత్రమే కాదు... సినిమా రైట్స్ కూడా తీసుకుంటానని చెప్పారట.
'బింబిసార' విడుదలకు ముందు సైతం 'దిల్' రాజుకు ఇదే విధంగా... ప్రత్యేకంగా సినిమా షో వేశారు హీరో కళ్యాణ్ రామ్. ఆయన డెసిషన్, రివ్యూ పర్ఫెక్ట్ అని! ఆ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు 'దిల్' రాజు! ఇప్పుడు 'డెవిల్' ఆంధ్ర రైట్స్ తీసుకోవాలని భావిస్తున్నారట. నైజాంలో నిర్మాత అభిషేక్ నామాకు సొంత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. అందుకని, ఆంధ్ర రైట్స్ వరకు వేరొకరికి ఇవ్వాలని చూస్తున్నట్లు ఉన్నారు. శని లేదా ఆది వారాల్లో డిస్ట్రిబ్యూషన్ డీల్స్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: మెంటల్ టార్చర్, బ్లాక్ మెయిల్ నుంచి పేమెంట్ క్లియరెన్స్ వరకు - 'డెవిల్' లేటెస్ట్ కాంట్రవర్సీ
అమెజాన్ ఓటీటీకి 'డెవిల్'!?
Devil movie 2023 ott platform: 'డెవిల్' విడుదలకు ముందు ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఆలిండియా లాంగ్వేజెస్ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుందని టాక్. అయితే... ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 'బింబిసార' భారీ విజయం సాధించడం... 'డెవిల్' ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. మధ్యలో వచ్చిన 'అమిగోస్' ఎవరికీ గుర్తు లేదు.
Also Read: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్
Devil movie actress name: 'డెవిల్'లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ నటించారు. ఈ జోడీ ఆల్రెడీ 'బింబిసార'లో నటించింది. ఇప్పుడు 'డెవిల్'తో మరో హిట్ మీద కన్నేసింది. ఇప్పటికే విడుదలైన పాటల్లో కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇంకా ఈ సినిమాలో మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మాళవికా నాయర్ కనిపించనున్నారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నరౌజి నటించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : గాంధీ నడికుడియార్, కూర్పు : తమ్మిరాజు, కథా విస్తరణ : ప్రశాంత్ బారది, కాస్ట్యూమ్ డిజైనర్ : విజయ్ రత్తినమ్ ఎంపీఎస్‌ఈ, కథ - కథనం - సంభాషణలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర రాజన్, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చర్స్, సమర్పణ : దేవాంశ్ నామా, నిర్మాణం & దర్శకత్వం: అభిషేక్ నామా.