Devil: మెంటల్ టార్చర్, బ్లాక్ మెయిల్ నుంచి పేమెంట్ క్లియరెన్స్ వరకు - 'డెవిల్' లేటెస్ట్ కాంట్రవర్సీ
Mark Bennington pending payments cleared by Devil Movie producers: కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా పేరు మరోసారి వివాదంలో వినిపించింది. అయితే... రెండు రోజుల్లో అంతా క్లియర్ అయ్యింది.
Devil movie latest controversy: ఫారిన్ యాక్టర్ మార్క్ బెన్నింగ్టన్ గుర్తు ఉన్నారా? అతడికి అమెరికా! హిందీలో జాన్ అబ్రహం 'పరమాణు' సినిమా చేశారు. అయితే... 'ఆర్ఆర్ఆర్'తో అతడికి ఎక్కువ గుర్తింపు లభించింది. ఆ సినిమాలో కన్నింగ్ హమ్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆయన మరో తెలుగు సినిమా చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్'లో ఓ క్యారెక్టర్ చేశారు. ట్రైలర్ చూస్తే... ఆయన కనిపిస్తారు. అయితే... ఈ సినిమా విషయంలో సోషల్ మీడియా వేదికగా మార్క్ బెన్నింగ్టన్ తీవ్ర విమర్శలు చేశారు.
మెంటల్ టార్చర్... డబ్బులు ఇవ్వలేదు!
'డెవిల్' సినిమా చిత్రీకరణ పూర్తి చేసి తొమ్మిది నెలలు కావొస్తున్నా... ఇప్పటికీ తన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, తనకు పేమెంట్స్ చేయలేదని మార్క్ బెన్నింగ్టన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతే కాదు... తన పాత్రకు వేరొకరి చేత డబ్బింగ్ చెప్పించారని, తాను డబ్బింగ్ చెప్పడానికి రెడీ అని ఆయన పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు ఈ విధంగా చేయడానికి సిగ్గు ఉండాలని అంటూ ఘాటుగా పోస్ట్ చేశారు.
Also Read: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్
మార్క్ బెన్నింగ్టన్ చేసిన విమర్శలపై 'డెవిల్' ఎగ్జిక్యూటివ్ నిర్మాత మోహిత్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. మార్క్ మేనేజర్ తమను బ్లాక్ మెయిల్ చేస్తూ మెంటల్ టార్చర్ పెడుతున్నారని, అతడికి ఇవ్వవలసిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేసినప్పటికీ... ఇంకా డబ్బులు కావాలంటూ వేధిస్తున్నారని మార్క్ పోస్ట్ కింద కామెంట్ చేశారు. మార్క్ తెలుగు డైలాగులు చెప్పలేరు కనుక వేరొక వ్యక్తి చేస్తా డబ్బింగ్ చెప్పించామని పేర్కొన్నారు. అగ్రిమెంట్ పేపర్లలో అతడితో డబ్బింగ్ చెప్పించాలన్న నిబంధన ఎక్కడా లేదన్నారు. కట్ చేస్తే... మార్క్ తన పోస్ట్ డిలీట్ చేశారు. కొత్తగా మరొక పోస్ట్ చేశారు.
పేమెంట్స్ క్లియర్ చేశారు! - మార్క్ కొత్త స్టోరీ
మార్క్ బెన్నింగ్టన్ ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం ఉదయం కొత్త స్టోరీ ఒకటి పోస్ట్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ తనకు ఇవ్వవలసిన పెండింగ్ పేమెంట్స్ అన్నీ క్లియర్ చేసినందని పేర్కొన్నారు. కాంట్రాక్టు ప్రకారం ఇంగ్లీష్ డైలాగులకు తనతో డబ్బింగ్ చెప్పించడానికి అంగీకరించారని తెలిపారు. తన కోసం టైమ్ స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన థాంక్స్ చెప్పారు. నటీనటులు ఎవరికి అయినా సరే ఇటువంటి సిట్యువేషన్ ఎదురైతే తనను కాంటాక్ట్ చేయమని ఆయన చివరగా రాయడం కొసమెరుపు.
కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ నటించిన ఈ సినిమాకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. డిసెంబర్ 29న సినిమా విడుదల కానుంది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మాళవికా నాయర్ కనిపించనున్నారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నరౌజి నటించారు.
Also Read: 'సలార్' కోసం వర్క్ షాప్స్ చేశామంతే, ప్రత్యేకంగా కష్టపడలేదు - ప్రభాస్ ఇంటర్వ్యూ
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : గాంధీ నడికుడియార్, కూర్పు : తమ్మిరాజు, కథా విస్తరణ : ప్రశాంత్ బారది, కాస్ట్యూమ్ డిజైనర్ : విజయ్ రత్తినమ్ ఎంపీఎస్‌ఈ, కథ - కథనం - సంభాషణలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర రాజన్, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చర్స్, సమర్పణ : దేవాంశ్ నామా, నిర్మాణం & దర్శకత్వం: అభిషేక్ నామా.