Tamil Nadu Politics:పెండింగ్‌లో ఉన్న సమస్యలేంటో చెప్పండి, ఎమ్మెల్యేలకు సీఎం లేఖ
Tamil Nadu Politics: తమ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న 10 సమస్యల్ని దృష్టిలోకి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు.
Tamil Nadu Politics:
వీలైనంత త్వరగా పరిష్కారం..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. తమ నియోజకవర్గాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న 10 సమస్యల్ని లిస్ట్ అవుట్ చేయాలని సూచించారు. ఆ సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి చర్చించాలని వెల్లడించారు. "CM in your constituency" కార్యక్రమంలో భాగంగా...వీటిని పరిష్కరించాలని తెలిపారు. ఇదే జాబితాను జిల్లా కలెక్టర్లకు 15 రోజుల్లో పంపాలని ఆదేశించారు. "ప్రజల అవసరాలేంటి..? వాళ్ల సమస్యలేంటి తెలుసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలోని 10 ముఖ్యమైన సమస్యల్ని నోట్ చేసుకుని పెట్టుకోవాలి" అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. వీటిలో ముఖ్యమైనవేంటో పరిశీలించి, అందుకు అనుగుణంగా పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం. గతంలో కొన్ని ప్రాజెక్టులకు, సంక్షేమ పథకాలకు దూరమైన వాళ్లకూ ప్రస్తుత ప్రభుత్వం ప్రయోజనాలు అందిస్తుంది. ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కో సమస్య పరిష్కరిస్తాం" అని స్టాలిన్ స్పష్టం చేశారు. మౌలిక వసతులు, తాగునీటి వనరులు, మెడికల్ ఫెసిలిటీస్, రహదారులు,టూరిస్ట్ ప్లేస్‌ల సుందరీకరణ..ఇలాంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారు. స్కూల్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు, పాలిటెక్నిక్ అండ్ ITIల కొరత ఉన్నా...ఆయా ఎమ్మెల్యేలు తప్పకుండా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారుస్టాలిన్.
சட்டமன்ற உறுப்பினர்கள் தங்கள் தொகுதியில் நீண்ட நாட்களாக தீர்க்கப்படாமல் உள்ள பத்து முக்கியமான கோரிக்கைகளை முன்னுரிமைப்படுத்தி பட்டியல் அனுப்பிட வேண்டும் என மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுக்கும் கடிதம் எழுதியுள்ளார். pic.twitter.com/ueyyp3W2fd
— CMOTamilNadu (@CMOTamilnadu) August 23, 2022
స్టాలిన్ సర్కార్‌కు ఏడాది..
ఈ ఏడాది మే నాటికి స్టాలిన్ ప్రభుత్వానికి ఏడాది పూర్తైంది. ఆ సందర్భంగా " CM in your constituency" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ ఇది అమలు కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమం కోసం రూ.1000కోట్లు కేటాయించారు. పరిపాలనా పరంగా స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు...సత్ఫలితాలే ఇస్తున్నాయి. గతంలో కనిపించని మార్పు..తనతోనేమొదలవుతుందన్న సంకేతాలిచ్చారాయన. అంతే కాదు. అటు కేంద్రంతోనూ కాస్త కఠిన వైఖరితోనే ఉంటున్నారు. ఆ మధ్య ప్రధాని మోదీ మిళనాడులో పలు కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్ ఆయనను ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తమిళ భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్టాలిన్ ఇంగ్లిష్, హిందీలో
ప్రసంగించలేదు. తమిళంలోనే ప్రసంగించారు . తాము తమిళనాడు వాళ్లమని.. తమిళంలోనే మాట్లాడతామని కూడా చెప్పారు. కాంగ్రెస్ హయాంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వచ్చిందని.." అఫీషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్" లాంగ్వేజ్ హోదా కోసం చాలా కాలంగా పోరాడుతున్నామని స్టాలిన్ తెలిపారు. తమిళనాట కూడా తమ ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న భాజపాకు..ఇది మింగుడు పడలేదు. అయితే ప్రధాని మోదీ మాత్రం...తమిళనాన్ని ప్రాచీన భాషగా పేర్కొన్నారు. భారతియార్ పాటను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభించారు. తమిళ భాష సుస్థిరం.. తమిళ సంస్కృతి విశ్వవ్యాప్తం అని ప్రశంసించారు. తమిళ భాషకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
Also Read: Musk Meets Pranay Pathole: ట్విటర్లో స్నేహం! భారతీయ యువకుడిని కలిసిన ఎలన్ మస్క్!