Sonusood : మీ దుంపతెగ .. అడిగితే ఇస్తున్నాడు కదా అని వాటిని కూడా అడుగుతారా ? సోనుసూద్‌కు కూడా మైండ్ బ్లాంక్ అయిపోయిందిగా..
కష్టాల్లో ఉన్నా సాయం చేయండి అంటే సోనుసూద్ ఇట్టే సాయం చేస్తున్నారు. అందుకని ఆయన్ను అన్నీ అడిగేస్తారా ? ఆయన చేసేస్తారా ? కానీ కొంత మంది అడుగుతారు.. ఆయన చేస్తారు కూడా !
సోను సూద్ అంటే కరోనా సమయంలో పేదల కోసం ఆవిర్భవించిన కొత్త దేవుడని ఆయన సాయం పొందిన వాళ్లు అనుకుంటారు. ఆయన సేవా కార్యక్రమాలు అలా సాగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు కూడా పెట్టించారు. ఆయనకు చాలా సార్లు వినూత్నమైన సాయం కోసం విజ్ఞప్తులు వస్తూంటాయి. అయితే అవి కామెడీగా పెడతారు. కానీ ముంబైలోని ఓ వ్యక్తి మాత్రం సీరియస్‌గానే కాస్త భిన్నమైన విజ్ఞప్తి చేశారు. అదేమిటంటే.. తన కరెంట్ మీటర్ పాడైపోయిందట. కొత్తది పెట్టించాలట.
Never imagined one day i will have to install an electricity meter.😂 https://t.co/5nI5O7NIbs
— sonu sood (@SonuSood) January 17, 2022
Also Read: ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?
సోనుసూద్ కి ట్వీట్ చేసిన వ్యక్తి కరెంట్ మీటర్ పని చేస్తోంది. కానీ డిస్ ప్లే పోయింది. కొత్తగా పెట్టాలని ఆయన కరెంట్ అధికారుల్ని కోరితే రూ. పన్నెండు వందలవుతుందని చెప్పారు. దానికి కూడా సరే అన్న వ్యక్తి కట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రెండు నెలల పాటు తిప్పించుకున్నారు కానీ పని కాలేదు. దీంతో సోనుకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి ఆశ్చర్యపోయిన సోనుసూద్.. లైట్ తీసుకోలేదు. అతని కష్టం తీర్చాడు. ఫోటోను ట్వీట్ చేసి.. ఇలాంటి సాయం చేస్తానని కలలో కూడా అనుకోలేదని జోకేశాడు.
आज आपने मुझ से बिजली का नया मीटर भी लगवा किया 😂🙏 https://t.co/5nI5O7NIbs pic.twitter.com/muEoyN3Ozv
— sonu sood (@SonuSood) January 17, 2022
Also Read: పంజాబ్‌లో డ్యూటీ ఎక్కిన ఈడీ..! ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై ఈ దాడులు తప్పవా ?
ఇలాంటి సాయాలు చేస్తే సోషల్ మీడియాలో జోకులేయడానికి చాలా మంది ఉంటారు. కొంత మంది తాను ట్విట్టర్‌లో బిజీగా ఉండటం వల్ల కరెంట్ బిల్ కట్టలేకపోయానని.. అందుకే తన మీటర్ తీసుకెళ్లిపోయారని.. అయితే సోను చేసిన సాయం వల్ల తన మీటర్ తిరిగి వచ్చిందని ఫోటోలు పోస్ట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
I was busy on Twitter .. forgot to pay my electricity meter bills .. Thank you sonu
— NewIndia Files🇮🇳 (@NeetFiles) January 17, 2022
I got back my meter 😍😁 pic.twitter.com/RVibh3ZhsE
Also Read: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!
సోనుసూద్‌పై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఆయన సోదరి పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. అయినప్పటికీ రాజకీయాలతో సంబంధం లేకుండా తన సేవా కార్యక్రమాలను సోనుసూద్ కొనసాగిస్తున్నారు.
Also Read: భారత్ ఇలా చేస్తే కేసులు తగ్గుతాయి.. లాక్‌డౌన్ అక్కర్లేదు: WHOలో భారత ప్రతినిధి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి