WHO on Covid 19: భారత్‌ ఇలా చేస్తే కేసులు తగ్గుతాయి.. లాక్‌డౌన్‌ అక్కర్లేదు: WHOలో భారత ప్రతినిధి

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ డబ్ల్యూహెచ్ఓలో భారత ప్రతినిధి కీలక సూచనలు చేశారు. ఇలా చేస్తే కరోనా కట్టడికి లాక్‌డౌన్‌లతో పనిలేదన్నారు.

FOLLOW US: 

దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతోన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లో భారత ప్రతినిధి కీలక సూచనలు చేశారు. కరోనాపై యుద్ధంలో ఆయుధాలుగా పరిగణిస్తోన్న వ్యాక్సినేషన్, భౌతిక దూరం వంటివి పాటిస్తే లాక్‌డౌన్‌లతో పనిలేదన్నారు. 

" ప్రస్తుత పరిస్థితుల్లో మన చేతిలో ఉన్న ఆయుధాలను, పరిష్కారాలను సరైన విధంగా వినియోగించుకోవాలి. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలి, మాస్కులను తప్పనిసరిగా వినియోగించాలి, భౌతిక దూరం పాటించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ మంది గుమిగూడకూడదు. ఇవన్నీ కచ్చితంగా అమలు చేస్తే లాక్‌డౌన్‌లు విధించాల్సిన పనిలేదు.                                       "
-రోడెరికో ఆఫ్రిన్, డబ్ల్యూహెచ్ఓలో భారత ప్రతినిధి

అలా చేయొద్దు..

కరోనా వ్యాప్తి అధికంగా ఉందని లాక్‌డౌన్‌ సహా ప్రయాణాలపై పూర్తి నిషేధాలు విధించడం సరికాదని రోడెరికో అభిప్రాయపడ్డారు. అలా పూర్తిగా నిర్బంధించడం కూడా సరైన విధానం కాదన్నారు. కేసులు ఎక్కువ ఉన్న చోట ఆంక్షలు విధిస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని భారత్‌కు సూచించారు.

" ప్రయాణాలపై పూర్తి ఆంక్షలు విధించాలని, ప్రజలను బయట తిరగనివ్వకుండా చూడాలని డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడూ చెప్పలేదు. సరైన ఆంక్షలు విధించడం వల్ల ఇలాంటి వాటిని నిరోధించవచ్చు.                                           "
-  రోడెరికో ఆఫ్రిన్, డబ్ల్యూహెచ్ఓలో భారత ప్రతినిధి

భారీగా కేసులు..

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ రోడెరికో ఈ సూచనలు చేశారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9 వేలకు చేరువైంది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,891కి చేరింది.

మరోవైపు దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 17,36,628కి చేరింది. మరో 310 మంది కరోనాతో మృతి చెందారు.1,57,421 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ కొవిడ్ పాజిటివిటీ రేటు 14.43కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.62గా ఉంది.

Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2 లక్షల 38 వేల కరోనా కేసులు.. దిల్లీ, ముంబయిలో తగ్గిన ఉద్ధృతి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: covid 19 omicron cases no need for lockdowns WHO India head Roderico H Ofrin WHO on Covid 19

సంబంధిత కథనాలు

Coronavirus Cases: దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు- 27 మంది మృతి

Coronavirus Cases: దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు- 27 మంది మృతి

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే

Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది

Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది

Fruits: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?

Fruits: ఏ పండ్లు తింటే ఏ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చో తెలుసా?

Sun Flower Seeds: పొద్దు తిరుగుడు పూల గింజల ధర తక్కువే, తింటే వైరస్‌లను తట్టుకునే శక్తి ఖాయం

Sun Flower Seeds: పొద్దు తిరుగుడు పూల గింజల ధర తక్కువే, తింటే వైరస్‌లను తట్టుకునే శక్తి ఖాయం

టాప్ స్టోరీస్

YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్

YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్

Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !

Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !

Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి

Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి

Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్‌లో రచ్చ రచ్చ

Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్‌లో రచ్చ రచ్చ