IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Punjab Elections : పంజాబ్‌లో డ్యూటీ ఎక్కిన ఈడీ..! ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై ఈ దాడులు తప్పవా ?

పంజాబ్ సీఎం బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రాజకీయ కుట్ర అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

FOLLOW US: 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. హఠాత్తుగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ దగ్గరి బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దాదాపుగా పన్నెండు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలో ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఎన్ని అక్రమాలు జరిగాయి.. ఎన్ని ఆధారాలు దొరికాయన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

Also Read: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్

అయితే ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలా సీఎం బంధువుల ఇళ్లను టార్గెట్ చేయడంపై సహజంగానే రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ ముఖ్య నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఓ నేత ఇంట్లో రూ. 170 కోట్లకుపైగా క్యాష్ దొరికింది. తీరా తేలిందేమిటంటే ఆ వ్యాపారి సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు కాదని.. పేరులో కన్ఫ్యూజ్ వల్ల ఐటీ అధికారులు ఆయన ఇంటిపై దాడి చేశారని వెళ్లడయింది. తర్వాత పేరు సరి చూసుకుని నిజమైన సమాజ్ వాదీ పార్టీ నేత ఇంట్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదు. ఆ ఎపిసోడ్ అలా ఉండగానే ఉప్పుడు ఈడీ పంజాబ్‌లో డ్యూటీ ప్రారభించింది. 

Also Read: ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?

పంజాబ్ సీఎం చన్నీని మానసికంగా తెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం చన్నీ కూడా అంటున్నారు.  బీజేపీది దురుద్దేశమని.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఎన్నికల సమయంలో  కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎలా దాడి చేశారో.. ఇప్పుడు తనపై అలా దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ దాడుల్ని రాజకీయ కక్ష సాధింపుగా చెప్పేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 

Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..

ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు.. బీజేపీయేత పార్టీల నేతలపై జరగడం కామన్. అందుకే విపక్ష పార్టీలన్నీ  కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ మిత్రపక్షాలుగా అభివర్ణిస్తూ ఉంటాయి. ఎన్నికల సమయంలోనే ఇలాంటిదాడులు చేస్తారని.. తర్వాత సైలెంట్ అవుతారని అనేక ఘటనలను ఉదహరిస్తున్నారు. అదే కేసులను ఎదుర్కొంటున్న వారు బీజేపీలో చేరితే వారిపై విచారణ కూడా ఉండదని విమర్శిస్తున్నారు. 

Also Read: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Jan 2022 04:14 PM (IST) Tags: BJP CONGRESS Punjab polls Punjab CM Charan Jeet Singh Channy Punjab CM attacked Channi relatives raided

సంబంధిత కథనాలు

Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!

Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్

Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్

Podu Lands Issue : పోడు భూముల కోసం పోరుబాట, పట్టాల కోసం గిరిజనుల ఎదురుచూపులు

Podu Lands Issue : పోడు భూముల కోసం పోరుబాట, పట్టాల కోసం గిరిజనుల ఎదురుచూపులు

VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!

VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు

టాప్ స్టోరీస్

Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!

Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!