Farm Laws Repeal Bill 2021: సాగు చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.
నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు 2021కి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ చట్టాలను రద్దు చేయాలని ఏడాదికాలంగా ఉద్యమిస్తోన్న రైతుల దీక్ష ఎట్టకేలకు ఫలించింది.
నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు నవంబర్ 29న పార్లమెంటు ఆమోదం పలికింది. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి ఉభయ సభలు.
నూతన సాగు చట్టాల రద్దు బిల్లు-2021కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సాగిన తమ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు ఇది నివాళి అని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర సహా వివిధ అశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని స్పష్టం చేశారు.
ఏడాది పోరాటం..
కేంద్రం గతేడాది తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగణంగా 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'ను పార్లమెంటులో ఆమోదించి రాష్ట్రపతికి పంపారు.
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
Also Read: Worlds Expensive City: ఈ నగరం చాలా కాస్ట్‌లీ!.. వెళ్తే జేబులో డబ్బులు ఖాళీ!
Also Read: Omicron Travel Rules: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!
Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్
Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు