అన్వేషించండి

India-Russia Summit: భారత్‌- రష్యా మైత్రి బంధం.. కీలక అంశాలపై మోదీ, పుతిన్ చర్చ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ.. 21వ భారత్- రష్యా వార్షిక సదస్సులో పాల్గొన్నారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది.

భారత పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిల్లీ చేరుకున్నారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్, మోదీ 21వ భారత్- రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

" కొవిడ్​-19 ద్వారా ఎదురైన సవాళ్లు మినహా భారత్​-రష్యా సంబంధాల పురోగతిలో ఎలాంటి మార్పు లేదు. మన ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోంది.                                     "
-భారత ప్రధాని నరేంద్ర మోదీ

" భారత్‌ను గొప్ప శక్తిమంతమైన, స్నేహపూర్వకమైన దేశంగా రష్యా పరిగణిస్తోంది. ఎప్పుటికీ రష్యా- భారత్ మధ్య బలమైన స్నేహం ఇలానే ఉంటుంది. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతోంది. భవిష్యత్తులో కూడా ఇది ఇలానే కొనసాగుతుంది.                                     "
-  వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

కరోనా విజృంభిస్తున్నా..

ఇరు దేశాల్లోనూ కరోనా విజృంభణ ఉన్నప్పటికీ పుతిన్.. భారత్ వచ్చారు. ముఖ్యంగా భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రష్యాలో కూడా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయినప్పటికీ పుతిన్ భారత పర్యటనకు వచ్చారంటే ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కీలకమో అర్థమవుతోంది.

కీలక ఒప్పందాలు..

భారత్- రష్యా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీలో 6 లక్షలకు పైగా ఏకే203 రైఫిల్స్‌ను భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేయనున్నాయి. ఈ ఒప్పందంపై భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, జెనరల్ సెర్గే షోయిగు సంతకం చేశారు.

ఏకే203 రైఫిల్స్​ తయారీతో పాటు రానున్న 10 ఏళ్లలో రక్షణ సహకారంపైనా ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అంతకుముందు భారత్, రష్యా విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య 2+2 చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రాంతీయ శాంతి, సుస్థిరతలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై మంత్రులు చర్చించారు. ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌లో తాజా పరిస్థితులపై ఇరు దేశాల మంత్రులు మధ్య కీలక చర్చ జరిగింది.

ఎప్పటిదో..

భారత్- రష్యా మైత్రి చాలా బలమైనది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఎన్నో కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య బంధం చాలా బలంగా ఉంది. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలతో భారత్‌కు ముప్పు పొంచి ఉన్న ప్రతిసారి రష్యా మనకు అధునాతన ఆయుధాలను అందించి ఆదుకుంది. హైపర్‌సోనిక్ ఆయుధాల తయారీలో రష్యాకు సాటి లేదు. అలాంటి దేశంతో మైత్రి భారత్‌కు కీలకం కానుంది.

చైనాతో సరిహద్దు ఘర్షణలు నెలకొన్న వేళ రష్యా అధ్యక్షుడు స్వయంగా భారత్‌కు రావడం విశేషం. కచ్చితంగా భారత్-రష్యా మైత్రిపై ఇది గొప్ప ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: Sri Lankan National Killed: మూక దాడులకు 'పాపి'స్థాన్ అడ్డా.. ఇదే చివరి అవకాశం బిడ్డా!

Also Read: Omicron Threat: ఈ 'చిత్రం' చూశారా? ఇది మార్కెట్టా.. ఎయిర్‌పోర్టా.. లేక వైరస్ హాట్‌స్పాటా?

Also Read: India-Russia Summit: భారత్- రష్యా మధ్య 4 ఒప్పందాలు.. అమేఠీలో 6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఓకే

Also Read: Nagaland Firing: 'వాహనం ఆపమంటే ఆపలేదు.. అందుకే సైన్యం కాల్పులు జరిపింది'

Also Read: Punjab Election 2022: భాజపాతో కెప్టెన్ దోస్తీ.. పంజాబ్ ఎన్నికల బరిలో కలిసే పోటీ

Also Read: Nagaland firing incident Update: నాగాలాండ్‌లో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోండి: కేంద్ర హోంశాఖను కోరిన సీఎం

Also Read: Nagaland Civilian Killings: నాగాలాండ్ కాల్పుల ఘటనపై మోదీ భేటీ.. పార్లమెంటులో అమిత్ షా ప్రకటన

Also Read: Allahabad High Court: 'కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు'.. హైకోర్టు సంచలన తీర్పు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,306 మందికి కరోనా.. 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
Hardik Pandya Fitness: పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
పాండ్యా దుకాణం సర్దేసే టైమ్ వచ్చిందా? పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడ్డ హార్దిక్
My Dear Donga Movie Review - మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?
Inter Exam Fee: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
Share Market Opening Today: బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
బాంబులు అక్కడ, పతనం ఇక్కడ - స్టాక్‌ మార్కెట్‌లో హై టెన్షన్‌
Embed widget