India Pak tensions:వార్ ప్రారంభమైతే రెండో రోజే పాకిస్తాన్ అడుక్కు తినాలి - ఈ ఒక్క కారణం చాలు
Pakistan Forex: యుద్ధం ప్రారంభమైతే పాకిస్తాన్ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆ దేశం దగ్గర చాలా పరిమితంగా ఉన్నాయి.

Pakistan in Danger: భారత్ లో ఉగ్రవాదం పెంచి పోషించడానికి పాకిస్తాన్ తన భవిష్యత్ ను పణంగా పెడుతోంది. ఆ దేశం ఇప్పటికే అప్పుల్లో ఉంది. విదేశీ మారకద్రవ్యం కూడా పరిమితంగానే ఉంది. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం 15.96 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నిల్వలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్వద్ద 11.3 బిలియన్ డాలర్లు, కమర్షియల్ బ్యాంకుల వద్ద 4.7 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ నిల్వలు కేవలం 2 నెలల దిగుమతులకు సరిపోతాయి. ఆ తర్వాత వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
భారత్ వైపు నుంచి ఎగుమతి, దిగుమతులు ఆపేశారు. భారీగా వ్యాపారం ఆగిపోతుంది. అదే సమయంలో ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం కూడా కోల్పోతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. ద్రవ్యోల్బణం భారీగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ రుణాల ఊబిలో చిక్కుకుపోయింది. సరిహద్దుల మధ్య సుదీర్ఘంగా సమస్యలు ఉంటే ఏ దేశానికైనా విదేశీ మారకద్రవ్య నిల్వలు కీలకం. దిగుమతులు, రుణ చెల్లింపులు, , యుద్ధ ఖర్చులు చాలా అవసరం.ఈ లెక్కలో చూస్తే అసలు పాకిస్తాన్ దివాలా స్థితిలో ఉందని అనుకోవచ్చు.
644.39 బిలియన్ డాలర్ల నిల్వలతో భారత్ పటిష్టమైన ఆర్థిక సామర్థ్యం ఉంది. సుదీర్ఘ యుద్ధాన్ని ఆర్థికంగా నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ నిల్వలు ఇంధనం, ఆయుధాలు, ఆహారం వంటి దిగుమతలకు ఉపయోగపడతాయి. కరెన్సీ స్థిరత్వాన్ని కొనసాగించడానికి సరిపోతాయి. భారతదేశం యొక్క GDP సుమారు 4.2 ట్రిలియన్ డాలర్లు. కానీ పాకిస్తాన్ 348.72 బిలియన్ డాలర్ల వద్దే ఉంది. అంటే భారత జీడీపీ పాకిస్తాన్ కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ. ఇది యుద్ధ ఖర్చులను భరించడానికి ఎక్కువ స్థోమతను అందిస్తుంది
Pakistan Is Bleeding Dry Just by Waiting
— Arun Pudur (@arunpudur) May 3, 2025
Daily cost of high alert = hundred of crores in fuel, manpower, ammo readiness
No money. No fuel. No forex.
IMF gave $180M to Pakistan—India spends more on toilet subsidies.
Electricity cuts. Fuel lines. No ammo. No spares. pic.twitter.com/jfNoWu86Y4
పాకిస్తాన్ అతి తక్కువ విదేశీ మారక నిల్వలతో యుద్ధం ఎక్కువ కాలం చేయలేదు. 15.96 బిలియన్ నిల్వలు కేవలం 3 నెలల దిగుమతులను కవర్ చేయగలవు. యుద్ధం ప్రారంభమైతే పదిహేను రోజుల్లోనే దివాల్ తీస్తుంది. యుద్ధ సమయంలో ఇంధనం, ఆయుధాలు, మరియు ఆహార దిగుమతుల కోసం అవసరమైన విదేశీ కరెన్సీని సమకూర్చడం పాకిస్తాన్‌కు సాధ్యం కాదు. పాకిస్తాన్ యొక్క దౌత్య సంబంధాలు పరిమితం, మరియు ఉగ్రవాద ఆరోపణలు అంతర్జాతీయ మద్దతును ఇవ్వవు. యుద్ధం కోసం ఐఎంఎఫ్ కూడా రుణం ఇవ్వదు.
యుద్ధం జరిగితే పాకిస్తాన్ బాగా ఇబ్బంది పడుతుంది. భారతదేశం కొంత నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ, బలమైన నిల్వలు, ఆర్థిక స్థితి దానిని స్థిరంగా ఉంచుతాయి.





















