India Shock To Pakistan: పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ - అన్ని రకాల మెయిల్ సర్వీసులు నిలిపివేత - ఒక్క వస్తువూ రాదు !
India suspends mail parcel service: భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి ఎయిర్ లేదా రోడ్డు మార్గం ద్వారా ఎలాంటి పార్శిల్స్ ను అందుకోవడాన్ని నిధించింది.

India suspends exchange of all inbound mail parcel services from Pakistan: పాకిస్తాన్ నుండి వాయు, ఉపరితల మార్గాల ద్వారా వచ్చే అన్ని రకాల ఇన్‌బౌండ్ మెయిల్ , పార్శిళ్ల మార్పిడిని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ శనివారం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. పాకిస్తాన్ హ్యాకర్లు భారతీయ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకున్నారు పాకిస్తాన్‌కు చెందిన "సైబర్ గ్రూప్ HOAX1337" ,"నేషనల్ సైబర్ క్రూ" వంటి హ్యాకింగ్ గ్రూపులు నగ్రోటా , సుంజువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకున్న ఒక రోజు తర్వాత ఇస్లామాబాద్ నుండి మెయిల్ మార్పిడిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులను ఎగతాళి చేసే సందేశాలతో హ్యాకర్లు వారిని అవమానించే ప్రయత్నం చేశారు.
The Government of India has decided to suspend exchange of all categories of inbound mail and parcels from Pakistan through air and surface routes: Ministry of Communication pic.twitter.com/23S6ci7nAB
— ANI (@ANI) May 3, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఆ తర్వాత కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్కడి నుంచి ఎలాంటి పార్శిల్స్ తీసుకోవడం.. పంపడం ఆపేయాలని నిర్ణయించుకుంది.
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన అన్ని ప్రత్యేక వీసాలను రద్దు చేయడం, పాకిస్తాన్ విమానయాన సంస్థలకు దాని గగనతలాన్ని మూసివేయడం , అమృత్‌సర్‌లోని అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయడం వంటి అనేక చర్యలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంది.
భారత్ పై పాకిస్తాన్ ఉగ్రకుట్రలు పన్నే అవకాశం కనిపిస్తోంది. పార్శిల్స్ రూపంలో పేలుడు పదార్ధాలు కూడా పంపవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా భారత్ నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్తతలు తగ్గే వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉండే అవకాశం ఉంది.
#India has suspended the exchange of all inbound mail and parcels from #Pakistan, the country's Ministry of Communication announced on Saturday.
— Khaleej Times (@khaleejtimes) May 3, 2025
This suspension applies to all incoming post—both through air and surface transport routes, it added.https://t.co/Ihi5Ly7keB pic.twitter.com/Wxz4oV2tCF
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన ఒక రోజు తర్వాత, ఏప్రిల్ 23న, భారతదేశంలోని పాకిస్తాన్ అత్యున్నత సైనిక అటాచ్‌లను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి, వారిని దేశం విడిచి వెళ్లమని ఆదేశించింది. భారతదేశం పాకిస్తాన్ నుండి తన సొంత సైనిక అటాచ్‌లను ఉపసంహరించుకుంది , ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్యను తగ్గించింది. ప్రస్తుతం సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. టెర్రరిస్టులను వదిలే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది.




















