అన్వేషించండి

Pakistan Funds:పాకిస్థాన్ ఆర్థిక మూలాలపై కొడుతున్న భారత్- ప్రపంచ ఆర్థిక సంస్థల ఫండింగ్ రాకుండా చేసేలా ప్లానింగ్

Pakistan Funds:పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే ఫండింగ్‌పై భారత్ దృష్టి పెట్టింది. వాటిని ఉగ్రవాదుల కోసం వాడుతోందని భారత్ ఆయా సంస్థలకు సమాచారం ఇవ్వబోతోంది.

Pakistan Funds: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌ను ఎన్ని విధాలుగా ఇరుకున పెట్టాలో అన్ని విధాలుగా బుక్ చేసేందుకు  భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ వివిధ ప్రపంచ ఆర్థిక సంస్థల వద్ద చేయి చాస్తోంది. లేకుంటే ఆ దేశంలో రోజు వారి కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదు. అందుకే అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌ను అష్టదిగ్బంధం చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది భారత్. 

పాకిస్తాన్‌కు అందించే నిధులను సమీక్షించి, వాటిని తగ్గించే అవకాశంపై భారత ప్రభుత్వం ప్రపంచంలోని అనేక ప్రముఖ ఆర్థిక సంస్థలతో చర్చలు జరపడానికి సిద్ధమవుతోంది. బిజినెస్ టుడే తన నివేదికలో ఒక ఉన్నతాధికారిని ఉటంకిస్తూ... భారతదేశం త్వరలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB)తో చర్చలు జరపబోతోంది. పాకిస్తాన్‌కు అందించే ఆర్థిక సహాయంపై పునరాలోచన చేయాలని కోరుతుందని తెలిపింది. 

ఉగ్రవాదంపై ఆందోళనలో భారత్ 
అధికారి ఇంకా ఏమన్నారంటే... సరిహద్దు దాటి ఉగ్రవాదం ఆగడం లేదు, పాకిస్తాన్‌కు నిరంతరాయంగా అందుతున్న నిధులపై భారతదేశం ఆందోళన చెందుతోంది. ఇటీవల పహల్గాంలో జరిగిన ఘటన తరువాత భారతదేశం తన దౌత్య ప్రయత్నాల్లో మార్పులు తీసుకురావాలని కోరుకుంటోందని ఇది తెలియజేస్తుంది.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు IMF బెయిల్‌అవుట్ ప్రోగ్రామ్ ద్వారా 37 నెలల కాలంలో 7 బిలియన్ డాలర్ల రుణం లభించనుంది. తద్వారా ఆదాయంలో మెరుగుదల, రాష్ట్ర లోటును తగ్గించి, ఇక్కడి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో కొంత సహాయం చేయవచ్చు.

సెప్టెంబర్ 2024లో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 7 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణానికి అనుమతి లభించింది. 1958 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ IMF ముందు 24 సార్లు చేతులు చాచింది. 

నిధులు ఎక్కడకు వెళ్తున్నాయి?
పాకిస్తాన్ తరపున నుంచి పదే పదే ఉగ్రవాదదాడులు జరుగుతున్న వేళ భారతదేశం దాని విశ్వాసం, పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు. ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి, ఆయుధాలు కొనుగోలు చేయడానికి, LOCలో చొరబడటానికి ఉపయోగిస్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తోంది.  

నివేదికల ప్రకారం ఆసియా అభివృద్ధి బ్యాంక్ పాకిస్తాన్‌కు 43.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. ప్రపంచ బ్యాంక్ కూడా పాకిస్తాన్‌లో జరుగుతున్న 365 ప్రాజెక్టులకు 49.7 బిలియన్ డాలర్లను కేటాయించింది, ఇందులో జనవరి 2025లో 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా ఉంది.

IMF కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాల చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో జరుగుతున్న 7 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా ఉంది. ఈ సహాయం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. 

వివిధ సంస్థలు ఇచ్చే నిధులను సక్రమంగా దేశాభివృద్ధికి కాకుండా భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకే వాడుకోందని ప్రపంచ ఆర్థిక సంస్థలకు భారత్ వివరించబోతోంది. ఇది విజయవంతమై పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందకుంటే మాత్రం ఆ దేశంలో విపత్కార పరిణామాలు చూడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే భారత్ తీసుకున్న చర్యలతో పాకిస్థాన్ గింగిరాలు తిరుగుతోంది. ఏం చేయాలో అర్థం కాక ప్రపంచ దేశాలవైపు సాయం కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడు భారత్ దాడి చేస్తుందో అన్న భయంతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget