హోమ్న్యూస్Omicron Virus Death: ఒమిక్రాన్ వేట మొదలైంది.. తొలి మరణం నమోదు.. ప్రధాని ప్రకటన!
Omicron Virus Death: ఒమిక్రాన్ వేట మొదలైంది.. తొలి మరణం నమోదు.. ప్రధాని ప్రకటన!
యూకేలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడు. ఇదే తొలి ఒమిక్రాన్ మరణం.
Written By : ABP Desam | Edited By: Murali Krishna | Updated at : 13 Dec 2021 05:48 PM (IST)
ఒమిక్రాన్ వేరియంట్
ప్రపంచంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. యూకేలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఓ వ్యక్తి మరణించినట్లు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
భారీగా మరణాలు..
ఒమిక్రాన్ ఉద్ధృతి కొనసాగితే ఈ నెల చివరినాటికి యూకేలో ఒమిక్రాన్ కేసులు పది లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులే సగానికి పైగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
యూకే జనాభాలో 12 ఏళ్లకు పైబడిన 81 శాతం మందికి రెండు డోసుల వాక్సిన్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఒమిక్రాన్ కారణంగా యూకేలో 25 వేల నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
మరోవైపు ఒమిక్రాన్ బారీనపడ్డవారిలో అధికశాతం మంది విదేశాల నుంచి వచ్చినవారేనని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 55 మందిలో 36 మంది సౌత్ ఆఫ్రికా, బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్, యూఏఈ, బెలారస్, హంగేరీ, ఇటలీ, నమీబియా నుంచి వచ్చారు.