X

Chief Justice Transfers : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు.. అధికారికంగా ప్రకటించిన న్యాయ మంత్రి !

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు వచ్చారు. దేశంలో మొత్తం ఎనిమిది హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లను నియమిస్తున్నట్లు కిరణ్ రిజుజు ట్విట్టర్‌లో ప్రకటించారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు బదిలీ అయ్యారు.  తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను నియమించారు. రాష్ట్రపతితో పాటు సీజేఐతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకున్నామని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ట్విట్టర్‌లో ప్రకటించారు. ఏపీ, తెలంగాణతో పాటు మరో ఆరు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. 20 రోజుల కిందటే చీఫ్ జస్టిస్‌ల బదిలీ, నియామకాల గురించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అప్పట్నుంచి పరిశీలనలో ఉంచిన కేంద్రం ఇప్పడు ఆమోద ముద్ర వేసింది. 

Also Read : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జనసేన పార్టీ ఏర్పాటు... మార్పు కోసం దెబ్బలు తినటానికైనా సిద్ధం... జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు

 ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఉన్నారు. గత జనవరిలోనే ఆయన ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు. బదిలీపై చత్తీస్‌ఘడ్ వెళ్తున్నారు. ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వచ్చిన హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు.  జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లినందున యాక్టింగ్ సీజేగా జస్టిస్ రామచంద్రరావు వ్యవహరిస్తున్నారు. ఆయనను కూడా బదిలీ చేశారు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది హైకోర్టులకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌లు ఉన్నారు. అన్ని హైకోర్టులకు పూర్తి స్థాయి సీజేలను సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులన్నింటికీ కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 

Also Read: హైదరాబాద్ ఫార్మా కంపెనీలో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం ! ఐటీ శాఖ కీలక ప్రకటన ! 

ఏపీ హైకోర్టు సీజేగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రస్తుతం చత్తీస్‌ఘడ్ సీజేగా ఉన్నారు. ఆయనను ఏపీ బదిలీ చేశారు. ఏపీ సీజే..చత్తీస్‌ఘడ్‌కు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలిజీయం ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి వీలైనంతగా మానవ వనరులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. శరవేగంగా న్యాయమూర్తులను నియమిస్తున్నారు. కేంద్రం విడతల వారీగా నియామకాలకు ఆమోద ముద్ర వేస్తోంది. 

Also Read: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం... చిగురుటాకులా వణికిన భాగ్యనగరం.. జీహెచ్ఎంసీ అలర్ట్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: supreme court kiran rijuju New Chief Justices AP and Telangana High Courts

సంబంధిత కథనాలు

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Breaking News Live Updates: ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

Breaking News Live Updates:  ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Huzurabad BJP : రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !

Huzurabad BJP :  రైల్వేస్టేషన్ల అభివృద్ధి.. రైతులకు పెన్షన్లు.. హుజురాబాద్ కోసం బీజేపీ మేనిఫెస్టో !
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?

Bigg Boss 5 Telugu: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?