అన్వేషించండి

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం... చిగురుటాకులా వణికిన భాగ్యనగరం.. జీహెచ్ఎంసీ అలర్ట్!

Heavy Rain in Telangana: వరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో భారీగా వర్షం కురుస్తోంది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ శుక్రవారం ప్రకటించింది.

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌‌లో వరుసగా రెండో రోజు భారీగా వర్షం కురుస్తోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. నేడు మరోసారి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం కురిసిన వర్షం నుంచే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు కాలనీలు ఇంకా వరద నీటిలో ఉండిపోయాయి. 

బంజారాహిల్స్‌, అమీర్‌పేట‌, దిల్‌సుఖ్ నగర్, కొత్త‌పేట‌, సరూర్ నగర్, ఖైరాతాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు ముషీరాబాద్‌, అంబర్‌పేట, కాచిగూడ, చంపాపేట్, పాతబస్తీ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. వరుసగా రెండో రోజు భారీ వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ ప్రజలను హెచ్చరించారు. జీహెచ్ఎంసీలో ఎక్కడైనా సమస్య ఉంటే తమకు తెలపాలని 040 21111111 కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చారు. భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద నీరు చేరి మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. 

Also Read: మరో అల్పపీడనం.. తెలుగు రాష్టాల్లో మళ్లీ కొన్ని రోజులు వర్షాలు

మూడు రోజులపాటు భారీ వర్షాలు..
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. తూర్పు మ‌ధ్య అరేర‌బియా సముద్రం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీరం మీదుగా ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం వ‌ర‌కు ఉన్న ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం బ‌ల‌హీన‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 10న ఉత్త‌ర అండ‌మాన్ సమీపంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావరణశాఖ పేర్కొంది.

Also Read: హైదరాబాద్ ఫార్మా కంపెనీలో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం ! ఐటీ శాఖ కీలక ప్రకటన ! 

ఉత్తర అండమాన్‌ సముద్రంలో నేడు లేదా ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడినా దాని ప్రభావం తెలంగాణపై ఉంటుంది. రాగల 4, 5 రోజుల్లో ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఆదివారానికి తీవ్రమై నాలుగైదు రోజుల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వైపు వచ్చే అవకాశం ఉంది అధికారులు అంచనా వేశారు. తెలంగాణాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: అధికారులు తనిఖీలకొచ్చారని బార్లలోని మందుబాబులు పరార్ ! కానీ అసలు విషయం తెలిసిన తర్వాత...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20i Update: భారత్ భారీ స్కోరు - అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
భారత్ భారీ స్కోరు - అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20i Update: భారత్ భారీ స్కోరు - అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
భారత్ భారీ స్కోరు - అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Abhishek Century: అభిషేక్ స్టన్నింగ్ సెంచరీ - సిక్సర్లతో ఊచకోత, టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు
అభిషేక్ స్టన్నింగ్ సెంచరీ - సిక్సర్లతో ఊచకోత, టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Embed widget