(Source: ECI/ABP News/ABP Majha)
Weather Update: మరో అల్పపీడనం.. తెలుగు రాష్టాల్లో మళ్లీ కొన్ని రోజులు వర్షాలు
తెలుగు రాష్టాల్లో మళ్లి వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఉత్తర అండమాన్ సముద్రంలో ఇవాళ లేదా రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 4,5 రోజుల్లో అది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపంది. ఈ అల్పపీడనం మరింత బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఇటీవల బంగాళాఖాతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడినా దాని ప్రభావం తెలంగాణపై ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు ఉత్తరంగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది ఆదివారానికి తీవ్రమై నాలుగైదు రోజుల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తుందని అంచనా. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించడం మొదలై గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి వెనక్కి మళ్లాయి. ఈ నెల 15 తరవాత తెలంగాణ నుంచి వెనక్కి వెళ్లవచ్చని అంచనా.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 8, 2021
ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం తదుపరి 4-5 రోజులలో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశలో కదలి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాఆంధ్రా తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది
Synoptic features of Weather Inference for Andhra Pradesh Dated-08.10.2021. pic.twitter.com/aT8raYO68W
— MC Amaravati (@AmaravatiMc) October 8, 2021
.
నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాంలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో ఐదారు గంటల వ్యవధిలోనే కుంభవృష్ఠి పడింది. శుక్రవారం మధ్యాహ్నం సుమారు నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పలు ప్రాంతాల్లో 5 నుంచి 13 సెంటీమీటర్ల దాకా వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటలో 13.6, నగరంలోని లింగోజిగూడలో 12.8, సైదాబాద్ కుర్మగూడలో 11.7 సెంటీమీటర్ల గరిష్ఠ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి