X

Mumbai Rave Party: ముంబయి క్రూజ్ షిప్ లో మరోసారి తనిఖీలు... మఫెడ్రోస్ డ్రగ్స్ స్వాధీనం.. ఎన్సీబీ అదుపులో మరో 8 మంది

ముంబయి క్రూజ్ నౌకలో ఎన్సీబీ అధికారులు మరోసారి తనిఖీలు చేసింది. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు.

FOLLOW US: 

ముంబయి క్రూజ్ షిప్ లో ఎన్‌సీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. తాజాగా మరో 8 మందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. మఫెడ్రోన్‌ అనే మాదక ద్రవ్యాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాంద్రా, అంధేరీ, లోఖండ్‌వాలా ప్రాంతాల్లో ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక మాదక ద్రవ్యాల పంపిణీదారుని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తికి షిప్ లో రేవ్ పార్టీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణ

ముంబయి డ్రగ్స్ పార్టీలో ఎన్సీబీ అదువులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు న్యాయస్థానం విధించిన ఒక్క రోజు కస్టడీ ముగియనుండటంతో ఇవాళ కిల్లా కోర్టు అడిషనల్‌ చీఫ్ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆర్‌ఎం నిర్లాంకర్‌ ఎదుట హాజరుపర్చారు. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున న్యాయవాది సతీష్‌ మానెషిండే కేసును వాదించనున్నారు. ఆదివారం రేవ్ పార్టీకి సంబంధించి ఎన్సీబీ 8 మందిని అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నిన్న అరెస్టయిన బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌తో పాటు ముగ్గురు నిందితులకు ఈ నెల 7వరకు ఎన్‌సీబీ కస్టడీకి ముంబయి సిటీ కోర్టు అనుమతించింది. ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది.

Also Read: సముద్రం మధ్యన షిప్‌లో సోదాలు ఎలా? అధికారులు అమలు చేసిన పక్కా ప్లాన్ ఏంటంటే..

నాలుగేళ్లుగా డ్రగ్స్

క్రూజ్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం వ్యవహారంలో ఆర్యన్‌ ఖాన్‌ సహా మొత్తం ఎనిమిది మందిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ సోమవారం మధ్యాహ్నం సిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆర్యన్‌ ఖాన్‌తో పాటు నిందితులను ఈ నెల 11 వరకు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌సీబీ కోరింది. ఈ అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. తాను నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఆర్యన్‌ ఎన్‌సీబీకి తెలిపినట్లు సమాచారం. అతను యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే అంతకుముందు షారుక్‌ ఖాన్‌... కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:Aryan Khan Drug Case: అవును.. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నాను: ఆర్యన్ ఖాన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Drugs Case mumbai news Shah Rukh Khan Mumbai rave party NCB aryan khan Bollywood drugs

సంబంధిత కథనాలు

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Amit Shah Birthday: ఇదేంటయ్యా ఎమ్మెల్యే.. చూస్కోవాలిగా.. అమిత్ షాకు బదులు 'అంకుశం రామిరెడ్డి'కి విష్ చేస్తే  ఎలా?

Amit Shah Birthday: ఇదేంటయ్యా ఎమ్మెల్యే.. చూస్కోవాలిగా.. అమిత్ షాకు బదులు 'అంకుశం రామిరెడ్డి'కి విష్ చేస్తే  ఎలా?

Lakhimpur Violence: ఆసుపత్రిలో చేరిన ఆశిష్ మిశ్రా.. కేంద్రమంత్రి కుమారుడికి డెంగీ!

Lakhimpur Violence: ఆసుపత్రిలో చేరిన ఆశిష్ మిశ్రా.. కేంద్రమంత్రి కుమారుడికి డెంగీ!

Breaking News Live: తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నారాయణ ఫైర్

Breaking News Live: తెలుగు రాష్ట్రాల సీఎంలపై సీపీఐ నారాయణ ఫైర్
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?