Modi Absent : లోక్‌సభకు ఒక్క రోజే హాజరైన ప్రధాని మోడీ.. ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు
లోక్‌సభకు ప్రధాని మోడీ ఒక్కరోజే హాజరయ్యారని..తర్వాత ఎప్పటికప్పుడు డుమ్మా కొడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు పోస్టర్లు ప్రదర్శించారు. తేదీల వారీగా ఆయన హాజరైన...హాజరు కాని తేదీలను ప్రదర్శించారు.
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైరయ్యారు. సభకు ఎక్కువగా హాజరు కావడం లేదని.. వారు మారకపోతే.. తాము మార్చేస్తామని ఆయన సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఎంపీలందరూ కంగారు పడ్డారు. అది వేరే విషయం.... మరి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభకు హాజరవుతున్నారా..?. ఈ డౌట్ బీజేపీ ఎంపీలకు రాదు.. వచ్చినా మనసులోనే పెట్టుకోవాలి. బయటకు చెప్పకూడదు. అలా చెబితే తర్వాత ఏం జరుగుతుందో వారికి తెలుసు. అయితే డౌట్ కాంగ్రెస్ ఎంపీలకు వస్తే వాళ్లకు అడ్డేం ఉండదు. సమాధానం వెదుక్కోవచ్చు. అలా వెదుక్కున్నారు కూడా. దాన్నే బయట పెట్టారు.
Today we want to know why PM not attending the Loksabha? @iamvijayvasanth . pic.twitter.com/RUbWEeDDZs
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 20, 2021
Also Read: లోక్‌సభ ముందుకు ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధాన బిల్లు. మరి వ్యక్తిగత గోప్యత మాటేంటి?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఒక్క రోజు అంటే ఒక్కరోజు.. అదీ కూడా ప్రారంభం రోజున మాత్రమే లోక్‌సభకు హాజరయ్యారు. తర్వాత పార్లమెంట్ కి రాలేదని.. కాంగ్రెస్ ఎంపీలు బయట పెట్టారు. ఎంపీలు మాణిగం ఠాగూర్, విజయ్ వసంత్ పోస్టర్లు తయారు చేసి పార్లమెంట్‌లో ప్రదర్శించారు. నవంబర్ 29న మాత్రమే మోడీ హాజరయ్యారని..తర్వాత ఒక్క సారి కూడా లోక్‌సభకు హాజరు కాలేదని.. వారు పోస్టర్లు వేసి ప్రదర్శించారు. విశేషం ఏమిటంటే ఈ మధ్యలో ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు కానీ లోక్‌సభకు హాజరు కాలేదు.
Also Read: ఐశ్వర్య రాయ్‌కు ఈడీ షాక్.. పనామా పత్రాల కేసులో సమన్లు జారీ
ప్రధానమంత్రి ఇటీవలి కాలంలో చాలా బిజీగా ఉంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆయా రాష్ట్రాల్లో అభివృద్ది కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. పలు మార్లు ఉత్తరప్రదేశ్ పర్యటనకు కూడా వెళ్లివచ్చారు. అయితే లోక్‌సభకు మాత్రం హాజరు కాలేదు. లోక్‌సభలో జీరో అవర్ తప్ప మొదట్లో పెద్దగా చర్చలు జరగలేదు. టీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో వాయిదాలు పడ్డాయి. తర్వాత టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
Also Read: Omicron Doubling: స్పీడ్ పెంచిన ఒమిక్రాన్.. 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు డబుల్!
లోక్‌సభకు ఎంపీలు ఖచ్చితంగా హాజరు కావాలని బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. పార్లమెంట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని చెబుతూ ఉంటారు. అయితే స్వయంగా సభా నాయకుడు అయిన ప్రధానమంత్రే లోక్‌సభకు రాకపోవడం కాంగ్రెస్ నేతలకు అస్త్రంగా మారింది. దాన్నే మాణిగం ఠాగూర్, విజయ్ వసంత్ హైలెట్ చేశారు.
Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి