Karnataka: బిచ్చగాడి అంతిమయాత్రకు వేలాదిమంది!.. మంత్రులు కూడా అతడ్ని కలిసేవారట!
కర్ణాటకలో ఓ బిచ్చగాడి అంతియాత్రకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
ఓ బిచ్చగాడి అంతిమయాత్రకు వేలమంది హాజరయ్యారు. అవును మీరు విన్నది నిజమే. అయితే అతేనేమి బిచ్చగాడు చిత్రంలో హీరోలా కోటీశ్వరుడు కాదు.. తల్లి కోసం అడ్డుక్కోలేదు. కానీ ఆయన అంతిమయాత్రకు వచ్చిన జనాన్ని చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. అసలేంటి ఆయన కథ?
లక్కీ బిచ్చగాడు..
కర్ణాటక బళ్లారి జిల్లాకు చెందిన దివ్యాంగుడైన బసవ అలియాస్ హుచ్చ బస్య (45) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆదివారం అతని అంత్యక్రియలకు వేలాది మంది హాజరయ్యారు. హడగాలి పట్టణంతో బస్యకు ప్రత్యేక అనుబంధం ఉంది. బస్యకు దానం చేస్తే తమకు అదృష్టం కలిసి వస్తుందని పట్ణణవాసులు నమ్ముతారు. అయితే ఎన్ని డబ్బులిచ్చినా కేవలం ఒక్క రూపాయే బస్య తీసుకుంటాడు.
అలాంటి మంచి మనిషి చనిపోయాడని.. పట్టణం మొత్తం ఫ్లెక్సీలు పెట్టేశారు ప్రజలు. బస్య అంతిమయాత్రకు వేలాది మంది తరలివచ్చారు. బ్యాండ్ బాజా పెట్టి అంతిమయాత్ర జరిపారు.
పెద్దలతో కూడా..
సాధారణ ప్రజలతో పాటు కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం దివంగత ఎంపీ ప్రకాశ్, మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ వంటి నేతలకు కూడా బస్య సుపరిచితుడని స్థానికులు అంటున్నారు. వారితో మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా అమాయకంగా మాట్లాడేవాడని చెబుతున్నారు. ఈ అంతిమయాత్ర ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Chhattisgarh Maoist: ఏడు రోజుల తర్వాత ఇంజనీర్‌ను విడుదల చేసిన మావోయిస్టులు
Also Read: In Pics: గాల్లో తేలినట్టుందే..! నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో.. ఈ నదిని చూశారా?
Also Read: Delhi Air Pollution: ఎన్‌సీఆర్ పరిధిలో అప్పటివరకు విద్యాసంస్థలు బంద్
Also Read: India Hits Back At Pakistan: 'పీఓకే నుంచి ఖాళీ చేసి మాట్లాడండి..' అడిగి మరీ తన్నించుకున్న పాక్
Also Read: Karnataka HC on Mosques: 'మసీదుల్లో లౌడ్ స్పీకర్లు వాడటానికి ఏ చట్ట ప్రకారం అనుమతిచ్చారు'
Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Also Read: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...
Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also Read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి