అన్వేషించండి

Opium: ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ

Opium Trade In India: ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో ఓపియం ప్రస్తావన ఉంది. అది ఇండియాకు ఎలా వచ్చింది? ఒకప్పుడు రక్తాలు పారించిన ఓపియంను ప్రస్తుతం ఎలా వాడుతున్నారు? అనేది తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ లో నల్ల మందు (ఓపియం) ప్రాముఖ్యత చూపించారు.
  • ఓపియం సాగు వెయ్యేళ్ల క్రితం భారతదేశంలో అరబ్బుల ద్వారా మొదలైంది.
  • బ్రిటిషర్లు ఓపియం వ్యాపారాన్ని ఆధునీకరించి, చైనాపై యుద్ధాలు చేశారు.
  • స్వాతంత్ర్యం తర్వాత ఓపియం వాడకం వైద్య అవసరాలకు మాత్రమే పరిమితమైంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన 'డ్రాగన్' గ్లింప్స్ చూశారా? అందులో ప్రశాంత్ నీల్ టేకింగ్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ & డైలాగ్ టాప్ క్లాస్ అంటున్నారు ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్. సినిమాలో కోర్ పాయింట్ డ్రగ్స్ అని అర్థం అవుతోంది. 'ఓపియమ్' (నల్ల మందు ) గురించి బ్రిటీషర్స్ ఇండియాను ఆక్రమించుకున్నారని గ్లింప్స్ (Dragon Glimpse)లో చూపించారు. దాంతో ఆ నల్ల మందు... మత్తు మందుకు చరిత్ర ఉందని అర్థం అవుతోంది. అసలు ఓపియం (Opium) అంటే ఏమిటి? దాని కోసం బ్రిటిషర్లు ఎందుకు అంత పట్టు పట్టారు? అనేది తెలుసుకోండి.

వెయ్యేళ్ల క్రితమే ఇండియాలో ఓపియం తయారీ
Opium Trade History In India: ఓపియం అనేది ఒక మొక్క నుండి తయారవుతుంది. పదో శతాబ్దంలో ఆ మొక్క (మత్తు మందు) ఇండియాలో ఎంటర్ అయింది. అప్పట్లో అరబ్ వర్తకుల ద్వారా జరిగే వ్యాపారాల నుంచి ఈ పంట ఇండియాలోకి వచ్చినట్టు ప్రాచీన గ్రంథం 'ధన్వంతరి నిఘంటువు' చెబుతోంది. మన దేశంలో దీని సాగుకు అనువైన వాతావరణం ఉండటంతో ఓపియంలోని అనేక వెరైటీలను పండించడం మొదలు పెట్టారు. పదిహేనవ శతాబ్దంలో మొఘలుల పాలన మొదలైన తర్వాత ఓపియం సాగును వాళ్ళు తార స్థాయికి తీసుకెళ్లారు. రాజ్యంలోని కీలక ప్రాంతాల్లో సైనిక సంరక్షణ మధ్యలో వీటిని పెంచడం మొదలుపెట్టి వ్యాపారం చేసేవారు. దీనిపై విధించే టాక్సులు సామ్రాజ్యానికి చాలా రాబడి తెచ్చేవి. 18వ శతాబ్దంలో బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఆధునిక పద్ధతుల్లో ఓపియం వ్యాపారాన్ని మరింత విస్తరించారు.

Also ReadDragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

యూరోపియన్ దేశాలకు ఇండియా నుంచి నల్ల మందు ఎగుమతి అయ్యేది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1757లో పూర్తిగా నల్ల మందు వ్యాపారాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో రైతులు దీని పండించాలనేది కూడా కంపెనీయే డిసైడ్ చేసేది. ఇక్కడ పండించిన నల్ల మందును చైనాలోకి స్మగుల్ చేయడానికి ప్రయత్నించేది. దాంతో చైనా, బ్రిటిష్ ఇండియా మధ్య 1839 - 42 కాలంలో రెండు యుద్ధాలు జరిగాయి. వాటిని ఓపియం వార్స్ (నల్ల మందు యుద్దాలు Opium Wars) అంటారు. బ్రిటిష్ ఇండియా మొత్తం ఆదాయంలో 15 శాతం నల్ల మందు వ్యాపారం నుంచి వచ్చేదని అప్పటి అకౌంట్స్ చెబుతున్నాయి.

Also ReadDragon Glimpse vs Peddi Trailer - డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?

స్వాతంత్రం తర్వాత నల్లమందుపై నిషేధం...
కేవలం మెడికల్ అవసరాలకు మాత్రమే వాడకం 
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నల్లమందు పంటపై నిషేధం విధించింది. అయితే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ సంరక్షణలో ఈ పంటను పండిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఓపియాన్ని ఫార్మాసూటికల్ రంగంలో వాడుతున్నారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందులు దీని నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ద్వారా చట్టబద్ధంగా ఓపియంను తయారు చేసే ఏకైక దేశం ఇండియా మాత్రమే. సహజ సిద్ధంగా పండించే ఓపియంను ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ వద్ద కల గవర్నమెంట్ ఓపియం అండ్ ఆల్కలాయిడ్ వర్క్స్ ప్రాసెసింగ్ యూనిట్... అలానే మధ్య ప్రదేశ్ లోని నీముచ్ ప్లాంట్లలో అత్యంత సంరక్షణ మధ్య ప్రాసెస్ చేస్తారు. మార్ఫిన్, దగ్గుమందు లాంటి సిరప్ తయారీకి ఓపియంను వినియోగిస్తారు.

ఒకప్పుడు చరిత్రలో రక్తాలు పారించిన ఓపియం ప్రస్తుతం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి పరిమితమైంది. ఈ పాత కథను తిరిగి తెరపైకి తనదైన తీసుకొస్తున్నారు ప్రశాంత్ నీల్. అది ఈ రోజు విడుదలైన గ్లింప్స్‌తో స్పష్టమైంది. సినిమా విడుదలైన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget