అన్వేషించండి

Dragon Glimpse Decoded: ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌ డీకోడెడ్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్, హిడెన్ డీటెయిల్స్ గమనించారా?

NTR Dragon Trailer Analysis: ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ విడుదలైంది. నాలుగున్నర నిమిషాల వీడియోలో ప్రశాంత్ నీల్ ఏం చెప్పారు? ఏం దాచారు? ఇందులో హిడెన్ డీటెయిల్స్ ఏమిటి? డీటెయిల్డ్ అనాలసిస్‌లో...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎన్టీఆర్ 'డెవిల్ వాజ్ బోర్న్' గా, విధ్వంసకర పాత్రలో కనిపించనున్నారు.
  • సినిమా 1967 నాటి డ్రగ్స్ వ్యాపార నేపథ్యంలో, రెండు గ్రూపుల మధ్య యుద్ధం.
  • గోల్డెన్ ట్రయాంగిల్, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీల పాత్రలు, అనిల్ కపూర్ పాత్ర మిస్టరీ.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) అభిమానులు మాత్రమే కాదు... ప్రేక్షకులు అందరూ మెచ్చేలా 'డ్రాగన్' గ్లింప్స్ (Dragon Glimpse) ఉందని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం అవసరం లేదు. నాలుగున్నర నిమిషాల వీడియోలో దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మనకు ఏం చెప్పారు? హిడెన్ డీటెయిల్స్ ఏం చెప్పారు? ఇంకా ఏం దాచారు? అనేది డీటెయిల్డ్ అనాలిసిస్‌లో...

ఇప్పుడు నీల్ తప్పు చేయలేదు...
ముందుచూపు మామూలుగా లేదు!
'నారంగ్ రష్యన్లను తీసుకొచ్చుకున్నాడు... గురుంగ్ వాళ్ళు సెర్బియన్ ఆర్మీని తీసుకొచ్చుకున్నాడు... నువ్వు చెప్పు ఎంత మందిని తెచ్చుకుంటున్నాం' - ఇదీ 'సలార్'లో ఓ డైలాగ్. సినిమాలో క్యారెక్టర్లు ఎక్కువ. అయితే... ప్రేక్షకులకు క్లారిటీ తక్కువ. ఆ సినిమా విషయంలో మాత్రమే కాదు... 'కేజీఎఫ్' సిరీస్ విషయంలోనూ ప్రేక్షకులను నుంచి వచ్చిన కంప్లైంట్ ఒక్కటే! ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది సరిగా అర్థం కాలేదని!

Dragon Release Date: జూన్ 11, 2027న 'డ్రాగన్' విడుదల. ఏడాది ముందు గ్లింప్స్ ఎందుకు? నాలుగున్నర నిమిషాల నిడివి ఎందుకు? అని కామెంట్లు వచ్చాయి. కానీ గ్లింప్స్ చూస్తే... అంత నిడివి ఎందుకో క్లారిటీ వస్తుంది. క్యారెక్టర్స్‌ విషయంలోనూ క్లారిటీ ఇచ్చేశారు. ఎవరి క్యారెక్టర్ ఏమిటి? స్పష్టంగా చెప్పారు. థియేటర్లలోకి ఈ సినిమా వచ్చే సమయానికి గ్లింప్స్‌ను ప్రతి ఒక్కరూ కొన్ని వందల సార్లు చూస్తారు. అందువల్ల క్యారెక్టర్స్ విషయంలో కన్‌ఫ్యూజన్ ఉండదు. స్క్రీన్ మీద క్యారెక్టర్ ఎంత సేపు కనిపించినా సరే... ఎవరేమిటి? అనే ఐడియా ఉంటుంది.

ఎన్టీఆర్... ది డెవిల్ వాజ్ బోర్న్!
NTR Role In Dragon Movie: వెండితెరపై ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందనేది ఒక్క షాట్‌లో చెప్పేశారు ప్రశాంత్ నీల్. గ్లింప్స్‌లో ఆయన ఫస్ట్ షాట్ చూశారా? కొండపై వందల శవాలు పడి ఉన్నాయి... వాటి మీదుగా వెళితే నిలబడిన ఎన్టీఆర్! 'డెవిల్ వాజ్ బోర్న్' అని ఓ డైలాగ్. ఇక్కడ బైబిల్ రిఫరెన్స్ (జెనిసిస్) ఇచ్చారు నీల్. బైబిల్ ప్రకారం దేవుడు (జీసస్) ప్రపంచాన్ని ఎలా సృష్టించారో చెబుతుంది. వారంలో ఒక్కొక్కటి సృష్టించిన దేవుడు... ఏడో రోజు విశ్రాంతి తీసుకోగానే 'డెవిల్' (ఎన్టీఆర్) జన్మించాడని చెప్పారు.

Also Read: Dragon Glimpse vs Peddi Trailer - డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?

Dragon Glimpse Decoded: ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌ డీకోడెడ్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్, హిడెన్ డీటెయిల్స్ గమనించారా?ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే బీభత్సమైన యాక్షన్ సీక్వెన్సులు, రక్తపుటేరులు పారే ఊచకోత లాంటి ఫైట్లు 'డ్రాగన్'లో ఉంటాయని క్లారిటీ ఇచ్చేశారు. 'దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు... ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం. నిద్రపోయినప్పుడు నా కలలోకి చంపినవాళ్ల ముఖాలు రావు. మిగిలి ఉన్న శత్రువుల ముఖాలు కనబడతాయి. పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు' అంటూ ఇచ్చే వార్నింగ్ అయితే పీక్ ఫ్యాన్ మూమెంట్. సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు లూగర్ అని చెప్పారు. అదొక జర్మన్ పిస్టల్ పేరు.

'డ్రాగన్' కథ ఏమిటో చెప్పేశారు...
బ్యాక్‌డ్రాప్ కూడా రివీల్ చేసేశారు!
NTR Dragon Movie Story: ప్రశాంత్ నీల్ చేసిన మరో పని... 'డ్రాగన్' స్టోరీ రివీల్ చేయడం! అవును... హెరాయిన్, ఓపియమ్ (డ్రగ్స్) నేపథ్యంలో కథ రాశారని అర్థమైంది. 1967లో బ్యాక్‌డ్రాప్ అని చెప్పేశారు.

Also Read: NTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

డ్రగ్స్ బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ కోసం రెండు గ్రూపుల మధ్య భారీ యుద్ధం జరుగుతోందని అర్థమైంది. బ్రిటీషర్ల ఇండియా నుంచి వదిలి వెళ్లిన తర్వాత డ్రగ్స్ సామ్రాజ్యంలో అప్పర్ హ్యాండ్ కోసం ఎవరెవరి మధ్య యుద్ధం అనేది మాత్రం దాచేశారు.

'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్...
గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాచ్ ఎక్కడున్నారు?
'డ్రాగన్' గ్లింప్స్ చూసేటప్పుడు వాయిస్ ఓవర్ మీద కాకుండా విజువల్స్ మీద ఒక లుక్ వేయండి. ప్రశాంత్ నీల్ మ్యాప్స్ చూపించారు. వాటిని జాగ్రత్తగా చూడండి...
Dragon Glimpse Decoded: ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌ డీకోడెడ్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్, హిడెన్ డీటెయిల్స్ గమనించారా?

'ఓపియమ్'ను పండించేది ఒకటి... ఆఫ్ఘనిస్తాన్, రెండోది... గోల్డెన్ ట్రయాంగిల్ అని. మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ దేశాల్లో కొండ ప్రాంతాలను కలిపి 'గోల్డెన్ ట్రయాంగిల్' అంటారు. అక్కడ డ్రగ్ సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఆ విషయాన్ని దాచేశారు ప్రశాంత్ నీల్. కేవలం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ జనాలను మాత్రమే చూపించారు. సో... ఎవరితో ఎన్టీఆర్ ఫైట్? ఎన్టీఆర్ వర్సెస్ 'ఎక్స్' అనేది చెప్పలేదు. క్యారెక్టర్లను పరిచయం చేశారు కానీ... కథలో కాన్‌ఫ్లిక్ట్ దాచేశారు. బొంబాయి నుంచి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీని కంట్రోల్ చేస్తున్నారని చెప్పేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అనేది చెప్పలేదు.

Also Read: Ravi Mohan Wife Aarti Background Family Details - 'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?

కథ చిన్నదేమీ కాదు... చాలా గ్లింప్స్‌లో చాలా విషయాలు ఉన్నాయ్. సోమాలియా జనరల్, రష్యన్ డ్రగ్ డీలర్లను చూపించిన నీల్... గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి ఎవరినీ చూపించలేదు. కథలో ఆ ఏరియా కూడా కీలకం. సో... కథలో పలు ప్రాంతాలకు ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అది కూడా దర్శకుడు నీల్ దాచేశారు. రుక్మిణీ వసంత్ చెప్పే క్రిస్టియన్ పదాలకు, ఆఫ్ఘనిస్తాన్‌లోని ముస్లింలకు సంబంధం ఏమిటి? రుక్మిణి చేతిలో ఉన్న చైల్డ్ ఎవరు? 'ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ'లో కీలకమైన వ్యక్తిని ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ (అనిల్ కపూర్) ఎందుకు అరెస్ట్ చేశారు? అనేది దాచేశారు ప్రశాంత్ నీల్. అనిల్ కపూర్ పాత్రను పరిచయం చేసినప్పుడు ఆయన్ను హీరో అన్నారు. కానీ, అసలు విలన్ ఆయనేనా? ఏమో... వెయిట్ అండ్ సీ. సో... సినిమా చిన్నదేమీ కాదు, ఇందులో చాలా విషయం ఉంది.

Also Read: Keneeshaa Francis - ఎవరీ కెనీషా? ఆర్తితో విడాకులకు కారణం ఈమేనా? జయం రవి గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెల్సా?

టాప్ హెడ్ లైన్స్

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget