అన్వేషించండి

Dragon Glimpse vs Peddi Trailer: డ్రాగన్ గ్లింప్స్‌ vs పెద్ది ట్రైలర్... ఏది బావుంది? ఎన్టీఆర్ vs రామ్ చరణ్... ఎవరిది అప్పర్ హ్యాండ్?

NTR Vs Ram Charan: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు 'డ్రాగన్' గ్లింప్స్ విడుదలైంది. దానికి కొన్ని గంటల ముందు 'పెద్ది' ట్రైలర్ విడుదలైంది. రెండిటిలో ఏది బావుంది? అనే డిస్కషన్ మొదలైంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)... ఇద్దరూ మంచి స్నేహితులు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో నటించారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో వాళ్ళిద్దరి స్నేహం కనిపించింది కూడా! కానీ, ఇప్పుడు ఇద్దరి అభిమానుల మధ్య కాంపిటీషన్ మొదలైంది. ఎన్టీఆర్ పుట్టినరోజు (NTR Birthday) సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ (Dragon Glimpse) విడుదలైంది. ఆ గ్లింప్స్ రావడానికి కొన్ని గంటల ముందు 'పెద్ది' ట్రైలర్ (Peddi Trailer) విడుదలైంది. రెండిటిలో ఏది బావుంది? ఎవరిది అప్పర్ హ్యాండ్? అనేది చూస్తే...

మాసీ 'డ్రాగన్'... రూరల్ 'పెద్ది'!
అభిమానులకు కావాల్సిన 'హై' గానీ... చూసిన వెంటనే సినిమాపై ఇంట్రెస్ట్ గానీ క్రియేట్ చేసినది అయితే మాత్రం నిస్సందేహంగా 'డ్రాగన్' గ్లింప్స్ అని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. గ్లింప్స్ పేరుతో నాలుగున్నర నిమిషాల వీడియో విడుదల చేశారు ప్రశాంత్ నీల్. అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ సెకన్ నుంచి గ్లింప్స్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఆ ప్రపంచంలోకి ప్రతి ప్రేక్షకుడిని తీసుకు వెళ్లారు. అన్నిటి కంటే ముఖ్యంగా అభిమానులు ఎన్టీఆర్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగా చూపించడంలో సక్సెస్ అయ్యారు నీల్. 

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

మెగా అభిమానులు కోరుకున్నట్టు రామ్ చరణ్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా చూపించలేదా? అంటే... చూపించారు. కానీ, ఫ్యాన్స్ కోరుకునే 'హై' ఇవ్వడంలో 'పెద్ది' ట్రైలర్ ఫెయిల్ అయ్యింది. అభిమానుల సంగతి పక్కన పెడితే... కామన్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. 'డ్రాగన్'లో ఎన్టీఆర్ చెప్పినట్టు మాసీ డైలాగులు ఏవీ రామ్ చరణ్ నోటి నుంచి రాలేదు. ట్రైలర్ కట్ కూడా క్యూరియాసిటీ కలిగించలేదు. ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ, కుదరలేదు. ఎక్కడో బెడిసి కొట్టింది.

లుక్కు విషయంలో చెర్రీకి మార్కులు!
'పెద్ది' ట్రైలర్ సినిమాకు అవసరమైన బజ్ క్రియేట్ చేయడంలో ఫెయిలైనా సరే... లుక్ విషయంలో రామ్ చరణ్ మార్కులు కొట్టేశారు. క్రికెట్ నుంచి కుస్తీకి బాడీ పరంగా ఆయన చూపించిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఆడియన్స్ అందరి అప్రిసియేషన్ అందుకుంది. అదే సమయంలో ఎన్టీఆర్ లుక్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన మరీ సన్నగా ఉన్నారని, గడ్డం పెంచడంతో అదోలా ఉన్నారని కొన్ని కామెంట్స్ వినబడుతున్నాయి.

Also ReadRavi Mohan Wife Aarti Background Family Details - 'జయం' రవిని టార్చర్ పెడుతోందా? ఎవరీ ఆర్తి? విడాకుల కేసుతో పాపులరైన ఆమె బ్యాగ్రౌండ్ తెల్సా?

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలతో రామ్ చరణ్ ఫ్లాప్స్ అందుకున్నారు. 'పెద్ది'తో తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో సినిమాకు అవసరమైన బజ్ ఇంకా రాలేదు. దర్శకుడు బుచ్చిబాబు అండర్ ప్లే చేస్తున్నారని ఓ టాక్ ఉంది. సినిమాలో చివరి 50 నిమిషాలు ఎమోషనల్ హై ఇస్తుందని బుచ్చి చెబుతున్నారు. అది క్లిక్ అవ్వడంపై సినిమా రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. 

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన 'దేవర' మంచి హిట్. కానీ, హృతిక్ రోషన్‌తో నటించిన బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' ఫ్లాప్. ఇప్పుడు ఆయనకూ హిట్ అవసరం. అందువల్ల, 'డ్రాగన్' విషయానికి వస్తే... యాక్షన్ ఎంటర్టైనర్. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్ అభిమానులకు 'హై' ఇచ్చింది. ప్రస్తుతానికి ఎన్టీఆర్‌ది అప్పర్ హ్యాండ్ అని చెప్పక తప్పదు.

Also ReadKeneeshaa Francis - ఎవరీ కెనీషా? ఆర్తితో విడాకులకు కారణం ఈమేనా? జయం రవి గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెల్సా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Savitri Classics : మహానటి సావిత్రి అద్భుతాలకే అద్భుతం - వారికి మరణం ఉండదన్న బ్రహ్మానందం... సావిత్రి క్లాసిక్స్ ఇంగ్లీష్ బుక్ లాంచ్
మహానటి సావిత్రి అద్భుతాలకే అద్భుతం - వారికి మరణం ఉండదన్న బ్రహ్మానందం... సావిత్రి క్లాసిక్స్ ఇంగ్లీష్ బుక్ లాంచ్
Horror Thriller OTT : రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Embed widget