అన్వేషించండి

Keneeshaa Francis: ఎవరీ కెనీషా? ఆర్తితో విడాకులకు కారణం ఈమేనా? జయం రవి గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ తెల్సా?

Who Is Keneeshaa: రవి మోహన్, ఆర్తి విడాకుల ఇష్యూలో సింగర్, థెరపిస్ట్ కెనీషా పేరు ఎక్కువ వినిపించింది. అసలు ఎవరీ అమ్మాయి? రవితో ప్రేమ నుంచి బ్రేకప్, అంతకు ముందు బ్యాగ్రౌండ్ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు జయం రవి, భార్య ఆర్తి విడాకుల సమయంలో కెనీషా ఫ్రాన్సిస్ వార్తల్లోకొచ్చారు.
  • కెనీషా బెంగళూరుకు చెందిన కళాకారిణి, తండ్రి తమిళియన్, తల్లి ఆఫ్రికన్.
  • గాయని, నర్తకి, థెరపిస్ట్ గా బహుళ ప్రతిభ కలిగిన కెనీషా రవిని పరిచయం చేసుకున్నారు.
  • రవి మోహన్, కెనీషా మధ్య స్నేహంపై వార్తలు, ఆపై ఇద్దరూ విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

తమిళ కథానాయకుడు రవి మోహన్ ('జయం' రవి), ఆయన భార్య ఆర్తి (Aarti Ravi) విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు కెనీషా ఫ్రాన్సిస్ (Keneeshaa Francis). ఆమెతో రవి మోహన్ ప్రేమలో పడ్డారు. విడాకులు రాక ముందు కలిసి తిరిగారు. అసలు ఎవరీ కెనీషా? రవి మోహన్ (Ravi Mohan)తో పరిచయం, ప్రేమ నుంచి బ్రేకప్ వరకు... అంతకు ముందు కెనీషా ఫ్రాన్సిస్ లైఫ్ గురించి తెలుసుకోండి.   

తండ్రిది తమిళం... అమ్మ ఆఫ్రికన్!
Keneeshaa Francis Parents: భిన్నమైన సంస్కృతి మధ్య పెరిగిన మహిళ కెనీషా ఫ్రాన్సిస్. ఆమె బెంగళూరుకు చెందిన కళాకారిణి. పుట్టింది, పెరిగింది అక్కడే. ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే... కెనీషా తండ్రి తమిళియన్ కాగా, అమ్మ కెన్యాకు చెందిన ఆఫ్రికన్ సంతతి మహిళ.

కెన్యా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, ఇండియా... ఇప్పటి వరకు కెనీషా తన జీవితాన్ని వివిధ దేశాలలో గడిపారు. తల్లిదండ్రులు ఇద్దరికీ సంగీత నేపథ్యం ఉంది. సంగీత కుటుంబం నుంచి వచ్చిన కెనీషాకు చిన్నతనం నుంచి కళలపై ఆసక్తి ఉండేది. మ్యూజికల్ రియాలిటీ షో 'ది స్టేజ్' ద్వారా గాయనిగా తొలి గుర్తింపు పొందారు. గాయకురాలిగా గోవాలో ఆమె చాలా పాపులర్. 

సింగర్ మాత్రమే కాదు... మల్టీ ట్యాలెంటెడ్!
కెనీషా ఫ్రాన్సిస్ కేవలం గాయని మాత్రమే కాదు... ఆమెలో నృత్యకారిణి, థెరపిస్ట్, స్పిరిచువల్ హీలర్ కూడా ఉన్నారు. ఎనిమిది రకాల లాటిన్ నృత్య రూపాలలో తాను శిక్షణ పొందినట్టు గతంలో ఓసారి కెనీషా తెలిపారు. గోవాలోని లైవ్ మ్యూజిక్ రంగంలో ఆమెకు మంచి పేరుంది. 

ఎడ్యుకేషన్ విషయానికి వస్తే... చిన్నప్పటి నుంచి సింగింగ్‌లో శిక్షణ పొందిన కెనీషా... సైకాలజీ చదివారు. తనను తాను 'థెరపిస్ట్‌'గా పేర్కొంటారామె. అయితే థెరపిస్ట్ అని చెప్పడానికి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఎక్కడా ప్రొడ్యూస్ చేయలేదు. కౌన్సెలింగ్‌, మెడిటేషన్, స్పిరిచ్యువల్ హీలింగ్ ద్వారా ప్రజలకు మానసిక ప్రశాంతత అందించే ప్రయత్నం చేస్తున్నానని చెబుతారు.

రవి మోహన్ జీవితంలో ఎప్పుడు వచ్చారు?
తనతో మాట మాత్రమైనా చెప్పకుండా విడాకులకు రవి మోహన్ అప్లై చేశారని ఆర్తి పేర్కొన్నారు. రవి మోహన్ విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత... కెనీషాతో కలిసి ఓ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం చర్చకు దారితీసింది. ఎవరు ఆ అమ్మాయి? అని తమిళ జనాలు ఆరా తీయడం మొదలైంది.

Also Read: Ravi Mohan Press Meet Ful Speech - కెనీషాతో బ్రేకప్, ఆర్తితో డివోర్స్‌పై 'జయం' రవి సంచలన ప్రెస్‌మీట్... రెచ్చిపోతే తట్టుకోలేరంటూ

గోవాలో రవి మోహన్, కెనీషా మధ్య పరిచయమైనట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ పరిచయం తర్వాత కాలంలో ప్రేమకు దారి తీసింది. కెనీషా రూపొందించిన ఓ పాట వీళ్ళిద్దరినీ దగ్గర చేసింది. అయితే... ఆర్తితో విడిపోతున్నట్టు ప్రకటించిన 2024లో కెనీషా తెరపైకి వచ్చారు. దర్శకుడిగా, నిర్మాతగా మారిన సమయంలో చెన్నైలో ఈవెంట్ చేశారు రవి మోహన్. అందులో కెనీషా సందడి చేశారు. రవి మోహన్, ఆయన తల్లితో కలిసి ఫోటోలు దిగారు. 

Also Read: Aarti Ravi Counter To Ravi Mohan - సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Mohan (@iam_ravimohan)

జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు తనకు కెనీషా అండగా ఉందని, ఒక 'లైఫ్ లైన్'లా నిలిచిందని రవి మోహన్ పేర్కొన్నారు. అయితే తమది కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రొఫెషనల్ సపోర్ట్ అన్నారు. ఆర్తితో వివాహ బంధంలో తానొక బానిసలా బ్రతికానని రవి మోహన్ చెప్పడం తమిళ చిత్రసీమలో తీవ్ర కలకలం సృష్టించింది. విడాకుల తర్వాత కెనీషాతో కలిసి తిరగడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. రవి మోహన్, అలాగే చెన్నై నుంచి వెళుతున్నట్లు కేనీషా చెప్పడంలో బ్రేకప్ చెప్పినట్టేనని అర్థం అవుతోంది. ప్రస్తుత వివాదాల కారణంగా మానసిక ఒత్తిడికి గురై సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు కెనీషా కూడా ప్రకటించారు.    

కెనీషా ఆస్తి విలువ ఎంత? మూడు కోట్లు??
లైవ్ షోలు చేయడం, మ్యూజిక్ ప్రాజెక్ట్స్, అలాగే థెరపీ సెషన్స్ ద్వారా కేనీషా ఫ్రాన్సిస్ సంపాదిస్తున్నారు. అలాగే బ్రాండ్ పార్టనర్‌షిప్‌ల ద్వారా ఆమెకు కొంత అమౌంట్ వస్తుంది. ఓ అంచనా ప్రకారం... కెనీషా ఫ్రాన్సిస్ నెట్ వర్త్ కోటి ఉంచి మూడు కోట్ల రూపాయల మధ్య ఉంటుంది.

Also Read: Ravi Mohan Vs Sujatha Vijayakumar - అల్లుడిగా అది నీ బాధ్యత... ఆమాత్రం ఖర్చు పెట్టలేవా? 'జయం' రవిపై అత్త సుజాత ఫైర్

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget