అన్వేషించండి

Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్

Aarti Ravi Vs Jayam Ravi: విడాకులు వచ్చే వరకు సినిమాలు చేయనని హీరో రవి మోహన్ స్పష్టం చేయడంతో పాటు భార్య ఆర్తిపై సంచలన ఆరోపణలు చేశారు. వాటిపై ఆర్తి రవి స్పందించారు. ఆమె ఏమన్నారంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తన పిల్లలను కలవనివ్వడం లేదని, ప్రాణాలు తీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
  • భార్య ఆర్తి, తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు.
  • రవి మోహన్ తో ఉన్న సింగర్ కెనీషా కూడా విడిపోయినట్లు తెలిపారు.

Jayam Ravi and Aarthi divorce latest news: భార్య ఆర్తి రవి నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు తమిళ హీరో రవి మోహన్ (Ravi Mohan). ఆ తర్వాత గాయని - థెరపిస్ట్ కెనీషా (Singer Keneeshaa)కు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన జీవితం నుంచి ఆవిడ కూడా వెళ్లిపోయారు. ఈ తరుణంలో జయం రవి అలియాస్ రవి మోహన్ శనివారం చెన్నై సిటీలో విలేకరుల సమావేశంనిర్వహించారు. తన ప్రాణాలు పోవాలని ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని... విడాకులు వచ్చే వరకు సినిమాలు చేయను అని... పిల్లలకు తనను దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. రవి మోహన్ వ్యాఖ్యలపై ఆర్తి స్పందించారు.

నా మౌనాన్ని బలహీనతగా భావించవద్దు!
రవి మోహన్ ప్రెస్ మీట్ తర్వాత ఆర్తి రవి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చాలా ఘాటుగా స్పందించారు. "నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడూ లేపవద్దు. ఒకవేళ... అది గనుక తల్లి సింహం (సివంగి) అయితే దేవుడే కాపాడాలి" అని ఆర్తి రాశారు. అంతే కాదు... తన మౌనాన్ని ఎవరూ బలహీనతగా భావించవద్దని లేదా ప్రయోజనం పొందాలని అనుకోవద్దని ఆర్తి హెచ్చరించారు.

అవసరమైతే తన పిల్లలను, తన గౌరవాన్ని కాపాడుకోవడానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ప్రపంచానికి నిజాలను వెల్లడిస్తానని ఆర్తి స్పష్టం చేశారు. నిజం ఎప్పుడూ విజయం సాధిస్తుందని ఆమె తెలిపారు. దాంతో ఆ నిజం ఏమై ఉంటుంది? అని చర్చ మొదలైంది.

Also Read: Peddi Trailer Review - 'పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి రివ్యూ... మెగా ట్వీటులో రామ్ చరణ్ డైలాగ్ లీక్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aarti (@aarti.ravi)

పిల్లల దగ్గరకు వెళ్లనివ్వడం లేదన్న రవి మోహన్!
ఇన్‌స్టాలో ఆర్తి పోస్ట్ చేయడానికి ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో రవి మోహన్ తన పిల్లల గురించి మాట్లాడారు. వాళ్ళ చదువుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నా కనీసం తనను కలవనివ్వడం లేదన్నారు. ఆర్తి పోస్టులోనూ పిల్లల గురించి ప్రస్తావన ఉంది. బహుశా ఆ అంశంతో పాటు విడాకుల వివాదం గురించి ఆవిడ ఏమైనా నిజాలు వెల్లడిస్తారమేమో!?

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

రవి మోహన్ కోసం చెన్నై వచ్చిన సింగర్ కెనీషా... సోషల్ మీడియాలో మే 15వ తేదీన (శుక్రవారం) బాంబు పేల్చారు. రవి మోహన్ పేరు ప్రస్తావించకుండా... అతని జీవితంలోకి ప్రేమతో వచ్చానని, ఇప్పుడు మౌనంగా చెన్నై నగరంతో పాటు అతని జీవితం నుంచి వెళ్తున్నానని పేర్కొన్నారు. రవి మోహన్ ప్రెస్ మీట్ తర్వాత కెనీషా & రవి మోహన్ మధ్య బ్రేకప్ జరిగినట్టు అర్థం అవుతోంది. రవి మోహన్ కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి మానసిక మద్దతు ఇవ్వడానికి మాత్రమే తాను ప్రయత్నించానని, కానీ ఈ ప్రపంచం తనలోని నిఖార్సైన ప్రేమను, విశ్వసనీయతను చూడనివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "అతడు ఇప్పుడు పూర్తిగా మీవాడే" అని కెనీషా పేర్కొన్నారు. దాంతో రవి మోహన్, ఆర్తి, కెనీషా జీవితాల్లో ఏం జరుగుతుందోనని చెన్నై సినిమా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Photo GalleryAnasuya Bikini Photos - బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget