అన్వేషించండి

Peddi Trailer: 'పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి రివ్యూ... మెగా ట్వీటులో రామ్ చరణ్ డైలాగ్ లీక్

Peddi Trailer Review: 'పెద్ది' ట్రైలర్ మే 18న విడుదల కానుంది. అయితే... మెగాస్టార్ చిరంజీవికి ముందుగా చూపించారు. ఆయన ఇచ్చిన రివ్యూ, డైలాగ్ లీక్ ఏమిటో చూడండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెద్ది ట్రైలర్ చూసిన చిరంజీవి 'జస్ట్ వావ్' అని రివ్యూ ఇచ్చారు.
  • రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, రెహమాన్ అద్భుతంగా పనిచేశారని తెలిపారు.
  • సినిమాలో ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్ నెస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చిరంజీవి చెప్పారు.
  • జాన్వీకి బదులు మరో హీరోయిన్ను ముందుగా సంప్రదించినట్లు దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. సోమవారం (మే 18వ తేదీన) ముంబైలో ట్రైలర్ (Peddi Trailer) విడుదల చేస్తున్నారు. అయితే... ముందుగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి చూపించారు. మరి, ట్రైలర్ చూశాక ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా? 'జస్ట్ వావ్' అని! ఇంకా 'పెద్ది' ట్రైలర్ గురించి చిరంజీవి ఏమన్నారో చూడండి.

చరణ్, బుచ్చి, రెహమాన్... రఫ్ఫాడించారు!
''పెద్ది' ట్రైలర్ చూశాను. జస్ట్ వావ్. మూడు నిమిషాల నిడివి ఉంది. స్వచ్ఛమైన ఫైర్ ప్యాక్డ్ ట్రైలర్ ఇది. రామ్ చరణ్... బుచ్చి (దర్శకుడు బుచ్చిబాబు)... రెహమాన్... ఒక్కొక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. ముగ్గురూ కలిసి మాత్రం రఫ్ఫాడించారు. ఎంత ఊహించుకున్నా అంతకు మించి ఉంటుందీ ట్రైలర్'' అని అంచనాలు మరింత పెంచారు చిరంజీవి. 

ట్రైలర్‌లో డైలాగ్... చిరు లీక్స్ ఇచ్చారబ్బా!
ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్... 'పెద్ది' ట్రైలర్‌ (Peddi Trailer Review)లో అన్నీ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయని చిరంజీవి తెలిపారు. చిరు లీక్స్ గురించి తెలిసిందే కదా! ఇంతకు ముందు ఓ ప్రెస్‌ మీట్‌లో వెళ్లి తన సినిమా టైటిల్, అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ లీక్స్ మరోసారి గుర్తు చేశారు.

Also Read: Jayam Ravi Press Meet Full Speech - జయం రవికి ప్రాణహాని ఉందా? భార్య ఆర్తికి వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? కెనీషా బ్రేకప్ & విడాకులు వచ్చే వరకు సినిమాలు చేయనని ఎందుకు చెప్పారు? ఫుల్ ప్రెస్ మీట్ డీటెయిల్స్
 
''అన్నట్టు... చాలా రోజులు అయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి'' అంటూ 'పెద్ది'లో రామ్ చరణ్ డైలాగ్ లీక్ చేశారు. అది ట్రైలర్‌లో ఉండబోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా! ''మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...నేను పోరాడాను సారు..." అని రామ్ చరణ్ డైలాగ్ లీక్ చేసి క్లాప్స్ ఎమోజీలు యాడ్ చేశారు. సారీ బుచ్చిబాబు ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పాను అంటూ సరదాగా ట్వీట్ ముగించారు.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

చిరంజీవికి కథ చెప్పకుండా తప్పించుకున్నా!
'పెద్ది' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బుచ్చిబాబు మరోవైపు ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించారు. చిరంజీవి గారికి కథ చెప్పకుండా తప్పించుకు తిరిగినట్టు చెప్పారు. తనకు అదొక ప్రౌడ్ మూమెంట్ అని తెలిపారు. 'పెద్ది' క్లైమాక్స్ గురించి కూడా బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ చెప్పారు. ఇటువంటి కథను మళ్ళీ తాను రాయలేనని, ఇటువంటి సినిమాను మళ్ళీ రామ్ చరణ్ చేయలేరని ఆయన వివరించారు.

Photo GalleryAnasuya Bikini Photos - బికినిలో అనసూయ... ప్రేక్షకులకు బర్త్ డే ట్రీట్
   
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అయితే జాన్వీని కాకుండా మరొక అమ్మాయిని హీరోయిన్ రోల్ కోసం ముందు సంప్రదించినట్టు బుచ్చిబాబు పేర్కొన్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు భారీ నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్నారు. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget