Uttarkashi Cloudburst: ఉత్తర్‌కాశీలోని ధరాలి గ్రామం ఎలా కనుమరుగైంది? వాతావరణ మార్పులే కారణమా?
Uttarkashi Cloudburst:2025 ఆగస్టు 5న ఉత్తరాఖండ్ ఉత్తరకాశి జిల్లా ధరాలి గ్రామంలో క్లౌడ్ బరస్ట్‌తో గ్రామం నాశనమైంది. ఈ ప్రకృతి విపత్తకు వాతావరణ మార్పులే కారణమా? హిమాలయాల్లో పెరుగుతున్న ముప్పేంటీ?

Uttarkashi Cloudburst: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలి గ్రామంలో కొన్ని నిమిషాల్లోనే కనుమరుగైపోయింది. ఆగస్టు 5న సంభవించిన ప్రకృతి విపత్తు ఆ పల్లెను అమాంతం మింగేసింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి దాదాపు 2,745 మీటర్ల ఎత్తులో ఉంది. ఇలాంటి ప్రాంతం వరద పోటుకు బలై పోవడం వాతావరణ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావడం లేదు. ఇది అసంభవమని చెబుతున్న వారంతా ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ధరాలిలో ప్రకృతి బీభత్సం సృష్టించిన వీడియో చూసిన ఎవరైనా వెన్నులో వణుకుపుడుతుంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన బురద నీరు గ్రామాన్ని కబలించిన దశ్యాలు ఇప్పటికీ మైండ్లో మెదులుతూనే ఉన్నాయి. దీనంతిటికీ క్లౌడ్ బరస్ట్ అని ప్రాథమికంగా చెబుతున్నారు.ఈ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్కు అవకాశమే లేదనే మాట గట్టిగా వినిపిస్తోంది.
వాతావరణ మార్పులపై నిరంతరం నిఘా అవసరం. అనూహ్యంగా మారుతున్న వాతావరణంపై ఫోకస్డ్గా లేకపోతే ధరాలిలో జరిగిన దుర్ఘటనలే చాలా ప్రాంతాల్లో చూడాల్సి వస్తుంది. అందుకే పెరుగుతున్న సాంకేతికతను జోడి వాతావరణం మార్పులను నిశితంగా అధికారులు గమనిస్తూనే ఉన్నారు. మరి ధరాలీ విపత్తు ఎలా సంభవించిందనే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆ ప్రాంతాంలో క్లౌడ్ బరస్ట్ అయ్యే వాతావరణం లేదవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
క్లౌడ్ బరస్ట్ అంటే 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావాలి. అలాంటి పరిస్థితినే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఆ స్థాయి వర్షం పడితేనే కొండచరియలు విరిగిపడతాయి. సమీప ప్రాంతంలో వరదలు సంభవిస్తాయి. కానీ ఐఎండీ ప్రకారం ధరాలి చుట్టు ఉన్న ఏ వాతావరణ కేంద్రంలో కూడా క్లౌడ్ బరస్ట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని రికార్డు కాలేదని చెబుతున్నారు.
ఇప్పుడు ఐఎండీ చెబుతున్న మాట విన్న శాస్త్రవేత్తలు షాక్ తింటున్నారు. క్లౌడ్ బరస్ట్ లేకుండా ఇంతటి విపత్తు ఎలా జరిగిందని స్టడీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇలాంటి విపత్తులను స్డడీ చేసిన కొందరు శాస్త్రవేత్తలు సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వాతావరణ కేంద్రాలు గుర్తించ లేదని 3000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో క్లౌడ్ బరస్ట్ జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
3000మీటర్ల ఎత్తులో జరిగిన క్లౌడ్ బరస్ట్ అనేది చాలా అరుధైన విషయంగా చెబుతున్నారు. హిమాలయాల్లో తరచూ ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంటున్నారు. సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితిని బట్టి తరచూ వెయ్యి నుంచి 2500 మీటర్ల ఎత్తులో క్లౌడ్ బరస్టు జరుగుతూ ఉంటుందట. దీని కారణంగానే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటాయి.
హిమాలయ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వెచ్చని గాలి, తేమ ప్రవహించి హిమాలయ పర్వతాలను తాకుతుతాయి. అక్కడ పరిస్థితి అనుకూలించకపోవడంతో అవి మరింత పైకి వెళ్తాయి. ముందు చెప్పినట్టు వెయ్యినుంచి 2500 మీటర్ల పైకి వెళ్లి కూల్ అవుతాయి. అప్పుడు ఆ గాలిలో పేరుకుపోయిన తేమ వర్షం రూపంలో కిందికి పడుతుంది. అదే క్లౌడ్బరస్ట్గా కురుస్తుంది. హిమాలయ ప్రాంతాల్లో సర్వసాధరణంగా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు జరిగింది చాలా అరుదు. 3000 మీటర్లకు ఎత్తుకు వెళ్లే కొద్ది గాలిలో తేమ తగ్గిపోతుంది. అందుకే క్లౌడ్ బరస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువని చెబుతున్నారు.
ధరాలి కేస్ స్టడీ ఏం చెబుతుంది?
పెరుగుతున్న గ్లోబల్‌వార్మింగ్ కారణంగా వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎత్తైనా ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా మారుతున్నాయని ఈ మధ్య కాలంలో సంభవించిన విపత్తులు తేల్చి చెబుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా హిమపాతాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇది ఒక ప్రమాదంగా మారుతుంటే... ఇప్పుడు ఊహించని క్లౌడ్ బరస్ట్‌లు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాల్లో భారీ వర్షాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఇలా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపోడుతున్నాయి. నేల కోతకు గురి అవుతోంది.
పర్వతాల్లో వాతావరణం చాలా భిన్నంగా సున్నితంగా ఉంటుందని అంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా మారుతున్న పరిణామాలు చూస్తుంటే వర్షాలు, వాటి వల్ల జరిగే ప్రమాదాలు పరిశీలిస్తే వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైనా ప్రాంతాల్లో 15 శాతం వరకు వర్షపాతం పెరిగిందని చెబుతున్నారు. మార్పు హిమాలయాల్లోనే కాకుండా ఆల్ప్స్ సహా చాలా పర్వత ప్రాంతాల్లో కనిపిస్తోందని వివరిస్తున్నారు. ప్రపంచ సగటుతో పోల్చుకుంటే 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరుగుతున్నాయని అంటున్నారు.
మంచు ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కడంతో మంచు త్వరగా కరిగిపోతోంది. ఫలితంగా నదులు దిశ మార్చుకుంటున్నాయి. నేపాల్కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ 2023లో ఓ నివేదిక ఇచ్చింది. హిందూ కుష్, హిమాలయ ప్రాంతాల్లో 2,000 కంటే ఎక్కువ హిమనదాలు ఉప్పొంగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇంతకీ ధరాలిలో ఏం జరిగింది?
ధరాలికి సమీపంలో ఉన్న ఖీర్ గడ నది ఉప్పొంగింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద ఉప్పెనలా ధరాలిపై విరుచుకుపడింది. దీంతో ఇళ్లు, ప్రజలు, ఇతర నిర్మాణాలు మాత్రమే కాకుండా ఏకంగా గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. వెంటనే భారత సైన్యం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు చేరుకొని వందల మంది ప్రజలను కాపాడారు. దుర్ఘటనలో ఏడుగురు మరణించినట్టు సమాచారం. మరో 50 మంది వరకు గల్లంతైనట్టు అధికారులు చెబుతున్నారు.





















