Uttar Kashi Cloud Burst: అందమైన గ్రామం క్షణాల్లో జలసమాధి - పర్యాటకులే కాదు ఆర్మీ బేస్ క్యాంప్ కూడా - వణుకుపుట్టించే వీడియోలు
Dharali: ఉత్తరాఖండ్‌లో కొండ అంచుల్లో ఉండే ధారాలి అనే అందమైన గ్రామం తుడిచి పెట్టుకుపోయింది. క్లౌడ్ బరస్ట్ కు తోడు కొండచరియలు విరుచుకుపడటంతో 50మంది గల్లంతయ్యారు.

Uttarkashi cloudburst More than 50 missing : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామంలో క్లౌడ్‌బరస్ట్‌లో భారీగా ప్రాణనష్టం జరిగింది. భారీ క్లౌడ్‌బరస్ట్ ఫలితంగా భాగీరథి నది సమీపంలోని గంగోత్రి ధామ్ వెళ్లే జాతీయ రహదారి 34 వెంబడి ఉన్న ఈ గ్రామంలో తీవ్ర విధ్వంసం సంభవించింది. ఈ క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఖీర్ గంగా నదిలో ఆకస్మిక వరదలు సంభవించి, గ్రామంలోని ఇళ్లు, హోటళ్లు, హోంస్టేలు, దుకాణాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుపోయినట్లుగా గుర్తించారు.
उत्तर काशी में बादल फटने की घटना बहुत दुखद है।😭🤲#दुखदघटना #sadnewstoday #verysadnews #uttarkashi #uttarakhand pic.twitter.com/IkszhK3bk0
— Ahmad Ali (@AhmadAl57414506) August 5, 2025
ఈ క్లౌడ్‌బరస్ట్ వల్ల గ్రామం అంతా తుడిచి పెట్టుకుపోవడంతో యాభై మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటి వరకూ నాలుగు మృతదేహాలనుగుర్తించారు. రెస్క్యూ బృందాలు గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్థానికులు, రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడే ప్రయత్నంలో ఉన్నార. ముఖ్యంగా హోటల్ నిర్మాణ స్థలంలో 8-9 మంది కార్మికులు గల్లంతైనట్లు నివేదికలు ఉన్నాయి.
Meanwhile our brave Army men were the first to respond in Uttarkashi. Another cloudburst above the Harsil Army camp has struck, and eight to ten personnel are reportedly missing. Prayers for their wellbeing. #Uttarkashi | #Uttarakhand pic.twitter.com/KzrxVIQd3i
— Nikhil saini (@iNikhilsaini) August 5, 2025
ధరాలీ గ్రామంలో క్లౌడ్‌బరస్ట్ సంభవించిన తర్వాత, సుమారు 3 గంటల తర్వాత సుక్కి టాప్ ప్రాంతంలో హర్సిల్‌లోని ఆర్మీ క్యాంప్ సమీపంలో మరో క్లౌడ్‌బరస్ట్ జరిగింది. ఈ రెండో క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఆర్మీ క్యాంప్ సమీపంలో భూమి కొట్టుకుపోవడం, బురద ప్రవాహం సంభవించింది. హర్సిల్‌లోని లోయర్ ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంప్ నుంచి 8-10 మంది సైనికులు గల్లంతైనట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది. కానీ ఖచ్చితమైన సంఖ్య లేదా వారి స్థితిపై అధికారిక ధృవీకరణ కాలేదు. ఈ గల్లంతైన సైనికుల కోసం శోధన మరియు రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
''People fleeing from homes to stay alive, but many were seen being swept away in no time''
— Sumit (@SumitHansd) August 5, 2025
Massive devastation in Dharali village near Gangotri Dham, likelihood of many people being killed, may God protect everyone 🙏🏻🙏🏻#Uttarakhand #Uttarkashi #Cloudburst #Dharali pic.twitter.com/v4IFLkzQXp
ధరాలీ గ్రామం, గంగోత్రి ధామ్‌కు వెళ్లే మార్గంలో హర్సిల్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో, భాగీరథి నది సమీపంలో ఉంది. ఇది గంగోత్రి యాత్ర ప్రధాన స్టాప్‌ఓవర్‌గా ఉంటుంది. ఈ క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఖీర్ గంగా నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి, ఇవి శిథిలాలు, రాళ్లు, చెట్ల కొమ్మలతో కూడిన భారీ నీటి ప్రవాహంగా గ్రామంలోకి దూసుకొచ్చాయి. ధరాలీ గ్రామంలోని స్థానిక మార్కెట్, 20-25 హోటళ్లు మరియు హోంస్టేలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గంగోత్రి ధామ్‌కు రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఘటన 2021లో చమోలీ జిల్లాలో జరిగిన విపత్తును గుర్తు చేస్తుంది, ఇందులో 200 మందికి పైగా మరణించారు.ధరాలీ క్లౌడ్‌బరస్ట్ జరిగిన మూడు గంటల తర్వాత, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుక్కి ప్రాంతంలో మరో క్లౌడ్‌బరస్ట్ నమోదైంది.





















