Pakistan: పీకలదాకా వరదలు వచ్చిన మైక్ వదలని రిపోర్టర్ - తర్వాత బయటకు రాలేకపోయాడు - పాకిస్తాన్‌లో విషాదం
Floods: భారీ వర్షాలు పడితే రిపోర్టింగ్ చేయవచ్చు కానీ ఆ వరదలు తనను లాక్కెళ్తున్నా పట్టించుకోకపోవడం వింతే. అలాంటి వింతలో ఓ రిపోర్టర్ గల్లంతయ్యాడు.

Pakistan channel reporter was swept away in floods: పాకిస్తాన్ లో టీవీ చానల్ రిపోర్టర్ల గురించి చాలా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రైల్వే స్టేషన్ లో లైవ్ ఇచ్చే ఓ రిపోర్టర్ వీడియోను భజరంగీ భాయిజాన్ వంటి సినిమాల్లో వాడుకున్నారు కూడా. ఇప్పుడు మరో రిపోర్టర్ అలాంటి వైరల్ వీడియోలో కనిపించారు. కానీ ఇప్పుడు వీడియో కామెడీ కాదు.. ట్రాజెడి.
పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలోని చహాన్ డ్యామ్ వద్ద జరిగిన ఒక ఘటనలో, ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ వరదలపై లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా బలమైన వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన వీడియోలో రికార్డ్ అయి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది,
వరదలు వస్తున్న సమయంలో జర్నలిస్ట్ లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో వరద పరిస్థితులను వివరిస్తున్నాడు. జర్నలిస్ట్ మెడ వరకు నీటిలో నిలబడి, మైక్రోఫోన్‌తో రిపోర్టింగ్ చేస్తున్నాడు. నీటి ప్రవాహం బలంగా మారడంతో అతను నీటిలో కొట్టుకుపోయాడు, చివరికి అతని తల, మైక్ పట్టుకున్న చేయి మాత్రమే కనిపించాయి. ఈ రిపోర్టర్ ఎవరో ఇంకా తెలియలేదు.
A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer
— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025
పాకిస్తాన్‌లో ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల వరదలు వచ్చాయి. అధికారిక నివేదికల ప్రకారం, ఈ వరదల కారణంగా కనీసం 116 నుండి 159 మంది మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 44 నుండి 103 మరణాలు నమోదయ్యాయి, ఆ తర్వాత ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (37), సింధ్ (18), బలూచిస్తాన్ (19), పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఒక రు చనిపోయారు.
🚨A Pakistani journalist lost his life while reporting from a flood-stricken area.
— Tamadon News - English (@TamadonTV_EN) July 17, 2025
The reporter had traveled to the disaster zone to cover the devastating floods in Pakistan. #Pakistan #Floods #Journalis #ExtremeWeather #TamadonNews pic.twitter.com/BTgCb3DwuR
చహాన్ డ్యామ్ పగిలిపోవడంతో రావల్పిండితో సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి, ఇది రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లను మరింత కష్టతరం చేసింది. పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ప్రకారం, 1,000 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్ ప్రపంచంలో అత్యంత క్లైమేట్-వల్నరబుల్ దేశాలలో ఒకటిగా ఉంది. శాస్త్రవేత్తలు ఈ తీవ్రమైన మాన్సూన్ వర్షాలను గ్లోబల్ వార్మింగ్ కారణంగా చెబుతున్నారు.
Flood Emergency in #Pakistan
— Nabila Jamal (@nabilajamal_) July 18, 2025
Chahan Dam collapses in Rawalpindi after relentless rainfall
Fauji Foundation Chowk & Bahria Town Phase 8 inundated
Reporter caught in flash floods👇 pic.twitter.com/RmUSN7Z3Yx





















