World Emoji Day 2025 : ప్రపంచ ఎమోజీ దినోత్సవం.. ఎక్కువమంది వాడే ఎమోజీలు ఏంటో? వాటి అర్థమేంటో తెలుసా?
Emoji Day : ప్రతి రోజూ మన భావాలను వ్యక్తపరచే (😍😂🔥) ఎమోజీల వెనక ఉన్న చరిత్ర ఏంటో.. వాటి అర్థాలు ఏంటో.. ఫన్ ఫ్యాక్ట్స్ చూసేద్దాం.

Popular Emoji Meanings : సోషల్ మీడియా కాలంలో ఎమోజీలకు కొరతే లేదు. ఇప్పటికీ రోజుకో కొత్త ఎమోజీ మన దృష్టిని ఆకర్షిస్తోంది. చాలామంది తమ పరిస్థితిని, ప్రేమని, బాధని ఇలా ఏ ఎమోషన్ని అయినా ఒక్క ఎమోజీ షేర్ చేసి చెప్పేస్తుంటారు. రొటీన్ లైఫ్‌లో కూడా ఈ ఎమోజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వాటి ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రతి సంవత్సరం జూలై 17వ తేదీన ప్రపంచ ఎమోజీ దినోత్సవం (World Emoji Day 2025) జరుపుతున్నారు. అసలు దీనిని ఎందుకు జరుపుతున్నారు? ఎక్కువమంది ఉపయోగించే ఎమోజీల అర్థాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎమోజీ డే చరిత్ర..
ఎమోజీపేడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ మొట్టమొదటిసారిగా 2014లో ప్రపంచ ఎమోజీ దినోత్సవాన్ని ప్రారంభించారు. అయితే జూలై 17వ తేదీనే ఎందుకంటే.. ఎక్కువమంది ఫోన్లలో క్యాలెండర్ ఎమోజీలో కనిపించే తేదీ జూలై 17. కాబట్టి ఆ తేదీనే ఈ ఎమోజీ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. డిజిటల్ సంభాషణలో ఎమోజీల ప్రాముఖ్యతను గుర్తించడానికే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఎప్పటి నుంచి వినియోగిస్తున్నారంటే..
ఎమోజీలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయినా సరే.. వీటి ప్రయాణం 1999 నుంచే మొదలైంది. జపాన్‌లో డిజైనర్ శిగెటాకా కురితా NTT DoCoMo టెలికాం కంపెనీకి చేస్తున్నప్పుడు మొదటిసారిగా 176 ఎమోజీలను క్రియేట్ చేశాడు. 2010లో ఎమోజీలను యూనికోడ్ స్టాండర్డ్‌లో చేర్చారు. 2011లో Apple iPhoneలో కీబోర్డ్‌ను ప్రవేశపెట్టింది. ఇవి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 2013లో ఆండ్రాయిడ్ కూడా వీటిని ప్రారంభించింది.
కామన్‌గా ఉపయోగించే ఎమోజీలు వాటి అర్థాలు
😂 : ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే ఎమోజీ ఇది. నవ్వుతో కంట్లోనుంచి నీరు రావడాన్ని సూచిస్తుంది. అయితే కొందరు తెలియక బాధలో కూడా చాలామంది ఈ ఎమోజీని తరచూ ఉపయోగిస్తున్నారు.
😢 : ఇది బాధని, నిరాశని సూచిస్తుంది. కంట్లోనుంచి నీరు వస్తూ.. ముఖం బాధతో నిండే ఈ ఎమోజీనికి కాడూ చాలామంది వాడుతూ ఉంటారు.
❤️: ప్రేమకు గుర్తుగా దీనిని వాడుతూ ఉంటారు. ఇది రొమాంటిక్ ఫీలింగ్స్‌ని సూచిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో దీనిని రియాక్షన్లో భాగంగా లైక్‌గా కూడా ఉపయోగించేస్తున్నారు.
🔥 : దీనిని ఎగ్జైటింగ్‌గా ఏదైనా చూసినప్పుడు లేదా ఎక్సలెంట్‌గా ఉందని చెప్పాలనుకున్నప్పుడు, ఊరమాసు వంటి ఫీలింగ్ ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నప్పుడు దీనిని వినియోగిస్తారు. హీరోయిన్స్‌ని చూసినప్పుడు, సినిమాలో మాస్ డైలాగ్‌లు ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.
😍 : కళ్లల్లో ప్రేమ నిండి ఉన్న ఈ ఎమోజీని కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎవరైనా ఫోటో పంపినప్పుడు.. ఎక్సైట్మెంట్తో ఉన్నప్పుడు ఈ ఎమోజీని వాడుతారు.
🥳 : ఏదైనా గుడ్ న్యూస్ విన్నప్పుడు, లేదా ఏదైనా సెలబ్రేట్ చేసేప్పుడు, బర్త్‌డే సమయంలో పార్టీ ఎమోజీని వినియోగిస్తారు. ఫెస్టివల్ స్పిరిట్‌ని ఇది కన్వే చేస్తుంది.
🤔 : ఏదైనా అర్థం కానప్పుడు, లేదా ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, డౌట్‌గా ఉన్నప్పుడు ఈ ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తారు.
😎 : సన్‌గ్లాస్ పెట్టుకున్న ఎమోజీ కాన్ఫిడెన్స్‌ని, గొప్పతనాన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే యాటీట్యూడ్ని రిఫ్లక్ట్ చేస్తుంది. దీనిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
🙏 : దండం పెట్టే ఎమోజీని ఫన్నీగా, సర్కాస్టిక్‌గా, గ్రాటీట్యూడ్ చూపించేప్పుడు, భక్తికి సంబంధించిన కంటెంట్ చేసేప్పుడు ఎక్కువగా వినియోగిస్తారు.
ఎమోజీలు ఎక్కడైనా, ఎవరికైనా అర్థమయ్యేలా ఉంటాయి. మాట్లాడకుండా భావాలు చెప్పడంలో హెల్ప్ చేస్తాయి. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా కొన్ని టెక్ కంపెనీలు కొత్త ఎమోజీలను విడుదల చేస్తుంటాయి. 2024 వరకు 3,800 కంటే ఎక్కువ ఎమోజీలు అందుబాటులోకి వస్తాయి. ప్రపంచంలో ఎక్కువగా వాడే ఎమోజీ నవ్వుతూ కన్నీళ్లు పెట్టే (😂) ఫేస్‌ని ఎక్కువగా వాడుతారట. మరి మీరు ఏ ఎమోజీ ఎక్కువగా వాడతారు?






















