అన్వేషించండి

PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి

US Iran War | 'మన్ కీ బాత్' 132వ ఎపిసోడ్‌లో పశ్చిమాసియా యుద్ధంతో పాటు టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది సవాళ్లతో కూడుకున్న సమయమని పేర్కొన్నారు.

Iran US War న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాల కారణంగా ప్రధాన ఇంధన రంగాలపై నిరంతరం ప్రభావం పడుతోందని, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం ముదురుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు (మార్చి 29) 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ విదేశాల ప్రజలతో తన ఆలోచనలను పంచుకున్నారు. మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘మార్చి నెల ప్రపంచ స్థాయిలో అనేక సంఘటనలతో నిండిపోయింది. గతంలో కోవిడ్ కారణంగా ప్రపంచం మొత్తం సుదీర్ఘకాలం పాటు అనేక సమస్యలను ఎదుర్కొన్నాం. కోవిడ్ సంక్షోభం నుండి బయటపడిన తర్వాత ప్రపంచం కొత్త ఆరంభంతో పురోగతి పథంలో పయనిస్తుందని అంతా ఆశించాం. కానీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో యుద్ధం, సంఘర్షణ పరిస్థితులు నిరంతరం తలెత్తుతూనే ఉన్నాయని’ అన్నారు.

భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మిగతా రాష్ట్రాల్లా ప్రశాతంత వాతావరణం కల్పించడంతో అక్కడ క్రికెట్ డెవలప్ అయి ఏకంగా రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్ జట్టు నిలవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో దేశం మరింత ముందుకు వెళ్తోందని, అయితే సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 నెల రోజులుగా భీకర యుద్ధం

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెల రోజులుగా భీకర యుద్ధం జరుగుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో పిఎం మోదీ అన్నారు. మన లక్షలాది కుటుంబాల బంధువులు ఈ దేశాల్లో నివసిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో పని చేస్తున్నారు. ‘నేను గల్ఫ్ దేశాలకు (Gulf Countries)  కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అక్కడ ఉన్న కోటి మందికి పైగా భారతీయులకు వారు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

పుకార్లను నమ్మవద్దు - ప్రధాని మోదీ

ఇది కచ్చితంగా సవాళ్లతో కూడుకున్న సమయం. ఈ సవాళ్ల నుంచి మనమందరం ఐక్యంగా బయటపడాలని 'మన్ కీ బాత్' ద్వారా దేశప్రజలందరినీ మళ్లీ కోరుతున్నాను. దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.  ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ విషయంలో సంక్షోభ పరిస్థితి నెలకొంటోంది. మన అంతర్జాతీయ సంబంధాలు, వివిధ దేశాల నుండి అందుతున్న సహకారం, గత దశాబ్ద కాలంలో దేశం నిర్మించుకున్న సామర్థ్యం కారణంగా భారత్ ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటోందని’ ప్రధాని మోదీ తెలిపారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఏమన్నారంటే

ప్రధాని మోదీ దేశప్రజలను ఫిట్‌నెస్, ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇప్పుడు 100 రోజుల కంటే తక్కువ సమయం ఉందని, ప్రపంచవ్యాప్తంగా యోగా పట్ల ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు. ఆఫ్రికాలోని జిబౌటిలో అల్మిస్ జీ తన 'అరవింద్ యోగా సెంటర్' ద్వారా యోగాను ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఆయన అక్కడ మరిన్ని ప్రాంతాల్లో ప్రజలకు యోగా నేర్పిస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ యువరాజ్ దువా తన తండ్రి చక్కెర (sugar) వాడకాన్ని తగ్గించాలని చేసిన విజ్ఞప్తిపై స్పందించినట్లు తెలిపారు. దానివల్ల అతడి తండ్రిపై సానుకూల ప్రభావం పడిందని పేర్కొన్నారు. దేశప్రజలు కూడా చక్కెర వాడకాన్ని తగ్గించాలని, వంట నూనె వినియోగంలో 10 శాతం తగ్గించాలని సైతం విజ్ఞప్తి చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Anti Paper Leak Amendment Bill 2026 Passed : పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Rahul Gandhi Latest News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో విద్యావ్యవస్థ" లోక్‌సభలో రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget