అన్వేషించండి

TVK Election Manifesto 2026: జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్

TVK Manifesto for Tamil Nadu Election 2026 | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తున్న టీవీకే అధినేత విజయ్ జాబ్ క్యాలెండర్ సహా వడ్డీ లేని రుణాలు లాంటి కీలక హామీలిచ్చారు.

టీవీకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విజయ్

డ్రగ్స్ రహిత తమిళనాడు: మాదకద్రవ్యాల రహిత రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తానని విజయ్ పార్టీ హామీ.

రూ. 20 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదనే లక్ష్యంతో 12వ తరగతి నుండి పీహెచ్‌డీ  వరకు చదువుకునే వారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామన్న విజయ్

జాబ్ క్యాలెండర్: ఏపీ బాటలోనే విజయ్ పయనిస్తున్నారు. ఏపీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షల నిర్వహణ,  నియామకాలకు సంబంధించి ఒక వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసి అమలు చేస్తామని హామీ ఇచ్చారు విజయ్.

నిరుద్యోగ భృతి: ఏపీ, తెలంగాణలో ఇలాంటి హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. తమిళనాడులోనూ టీవీకే పార్టీ నిరుద్యోగ భృతితో యువ ఓటర్లను ఆకర్షిస్తోంది. 29 ఏళ్లు దాటినా జాబ్ లభించని గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 4,000, డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు రూ. 2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి.

స్థానికులకు ఉపాధి - ప్రైవేట్ సంస్థలకు రాయితీలు: తమ సంస్థలోని మొత్తం సిబ్బందిలో 75 శాతం మంది తమిళులను నియమించుకునే ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్ర జీఎస్‌టీ (SGST)లో 2.5 శాతం సబ్సిడీ, విద్యుత్ ఛార్జీలలో 5 శాతం రాయితీ, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత కల్పిస్తామని విజయ్ ప్రకటించారు.

టీవీకే అభ్యర్థుల జాబితా ప్రకటించిన విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది టీవీకే పార్టీ. చెన్నై జిల్లాలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుండి టీవీకే అధినేత విజయ్ బరిలోకి దిగుతున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన కూటములకు దీటుగా తన అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసినట్లు విజయ్ స్పష్టం చేశారు. చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో అందరి వివరాలను వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ మార్చి 30న ప్రారంభం కానున్న తరుణంలో విజయ్ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో పాటు టీవీకే పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించారు. 

ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి?

అనంతరం ఆయన ప్రసంగిస్తూ, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో వివరించిన తీరు అక్కడ ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇది కేవలం అభ్యర్థుల పరిచయ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రజల రక్షకులను పరిచయం చేసే కార్యక్రమమని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్టీ అభ్యర్థులంతా సాధారణ కుటుంబాల నుండి వచ్చిన వారేనని, వారికి పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదని అందరూ అంటున్నారు. అయితే, ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చెబుతూ:

ఒక ఎమ్మెల్యే తన అనుభవాన్ని ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలి. కానీ దోచుకునేవాడిగా ఉండకూడదు.

ఎమ్మెల్యే పదవి అనేది సాధారణమైనది కాదు. ఆ నియోజకవర్గ ప్రజలకు రక్షకులుగా ఉండాలి

అనుభవం ఉందని క్వారీ పనుల్లో (మైనింగ్) నిమగ్నం కాకూడదు.

కేవలం అనుభవం ఉంది కదా అని ప్రశ్నలు అడిగే జర్నలిస్టులపై దాడులు చేసేవారిలా ఉండకూడదు అన్నారు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. డీఎంకే (DMK) నుండి వచ్చిన ఒక ఎమ్మెల్యేపై దోపిడీ కేసులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని, దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారని విజయ్ విమర్శించారు. నేడు డీఎంకే కూటమిలో ఉంటూ నిరంతరం మద్దతు ఇస్తున్న ఒక పెద్ద నాయకుడికి వ్యతిరేకంగానే 1996 ఎన్నికల్లో ఆయనను నిలబెట్టారని తెలిపారు. ఆ నాయకుడి పేరు తాను చెప్పడం లేదని, ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని విజయ్ పేర్కొన్నారు. .

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Child born the day after marriage: పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
Rahul number 16: రాహుల్ చెప్పిన 16 నెంబర్ కథేంటి? టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే కేంద్రం ఉండదని చెప్పాలనుకున్నారా?
రాహుల్ చెప్పిన 16 నెంబర్ కథేంటి? టీడీపీ ఎంపీల మద్దతు లేకపోతే కేంద్రం ఉండదని చెప్పాలనుకున్నారా?
Punjab Zombie drug: పంజాబ్‌లో జోంబీలుగా కనిపిస్తున్న యువత - జోంబీ డ్రగ్ ప్రభావమేనా?
పంజాబ్‌లో జోంబీలుగా కనిపిస్తున్న యువత - జోంబీ డ్రగ్ ప్రభావమేనా?
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hormuz Strait Open: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Child born the day after marriage: పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
AKASA SPICEJET Collision:  ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో AKASA AIR SPICE JET ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
 ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
Embed widget