Bihar Bridge Chori : ఖాళీగా ఐరన్ బ్రిడ్జి కనిపిస్తే చాలు ఎత్తుకెళ్లిపోతున్నారు - బీహార్‌లో అంతే !
బీహార్‌లో మరో వంతెనను చోరీ చేశారు దొంగలు. గత నెలలో చోరీ చేసిన పక్క ఊళ్లోనే ఈ దొంగతనం కూడా జరిగింది.
బీహార్ దొంగలు ఏదైనా దర్జాగా చేస్తారు. ఇప్పుడు వారి చూపు వంతెనలపై పడింది. ఎక్కడైనా పనికి రాని వంతెనలు ఉన్నాయో జనం వాడటం లేదో వాటిని గుర్తించి... ఎత్తుకెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిపోవడానికి అదేమోనా వెండా.. బంగారమా అనే డౌట్ రావొచ్చు.. దొంగలు ఆ పాత ఇనుమే వెండి..బంగారం కూడా. గ్యాస్ కట్టర్లు తీసుకు వచ్చి కట్ చేసి దొరికినదంతా తీసుకుపోతున్నారు. గత నెల మొదటి వారంలో ఇలా ఓ వంతెనను తీసుకెళ్లిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో వంతెన పని పట్టారు దొంగరు. విజయనగరంలో అర్థరాత్రి అత్యాచారం- పోలీసులు విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి బాధితురాలు షాక్!
రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల పాత వంతెన ఒకటి ఉంది. పక్కన కొత్త వంతెన కట్టడంతో అది వాడకంలో లేదు. ఝాఝా, పటనియా అనే గ్రామాల మధ్య ఉన్న వాగుపై 2004లో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో ఈ వంతెన నిర్మించారు. పుక్కా బ్రిడ్జ్ సహా కొత్తగా మరో రెండు వంతెనలు నిర్మించిన క్రమంలో దీనిని వినియోగించటం లేదు. దీంతో దొంగల కన్ను ఈ వంతెనపై పడింది.
అటు గంజాయి, ఇటు అక్రమ మద్యం - నెల్లూరు జిల్లాలో అసలేం జరుగుతోంది !
గత నెలలోనే రోహతాస్ జిల్లా నస్రీగంజ్‌లోని అమియావార్ అనే గ్రామంలో కాలువపై ఇనుప వంతెనను ఇరిగేషన్ అధికారుల పేరుతో రిపేర్ చేస్తున్నట్లుగా నటించి ఒక్కో పార్ట్‌ను ఊడ దీసి పట్టుకెళ్లిపోయారు. అధికారులుగా నటిస్తూ బుల్‌డోజర్లు, గ్యాస్ కట్టర్‌ల సాయంతో బ్రిడ్జి మొత్తాన్ని కోసి కూల్చివేసి వాహనాలపైకి ఎక్కించారు. మొత్తం మూడు రోజుల వ్యవధిలో దొంగలు బ్రిడ్జి మొత్తాన్ని మాయం చేశారు. బ్రిడ్జిని తీసుకెళ్తున్న కొందరిని గ్రామస్తులు ప్రశ్నిస్తే రిపేర్లకు అని చెప్పారు.
డాబాపై నిద్రిస్తుండగా జననాంగాలు కోసేసిన యువతి - తల్లి ప్రియుడిపై కూతురు ఘాతుకం
ప్రస్తుత వంతెన కూడా అంతే తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అరవై శాతం తీసుకెళ్లిన తర్వాత మిగతాది కట్ చేయడం కష్టం అనుకున్నారేమో కానీ వదిలేశారు. విచిత్రంగా గ్రామస్తులు కూడా ఈ వంతెన దొంగతనాన్ని పట్టించుకోవడం లేదు. ఏ ఒక్కరు ఫిర్యాదు చేయలేదు. ఇరిగేషన్ అధికారులే ఫిర్యాదు చేశారు. ఇలా వంతెనలను టార్గెట్ చేసిన ముఠా ఒకటేనని పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం వేట ప్రారంబించారు. అయితే దొంగలెవరో ... అటు పోలీసులకు.. ఇటు గ్రామస్తలకు కూడా తెలుసని.. ఎవరూ బయట పెట్టడం లేదన్న అనుమానాలు ఉన్నాయి.